Site icon OkTelugu

Thaman On Bro Movie: ఈ వారంలోనే ‘బ్రో’ శ్లోకం విడుదల..ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ గ్యారంటీ!

Thaman On Bro Movie

Thaman On Bro Movie

Thaman On Bro Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం ఈ నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ ని గ్రాండ్ గా ప్రారంభించబోతున్నారు మేకర్స్. రీసెంట్ గా ఈ చిత్రానికి సంగీతం అందించిన థమన్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘ త్రివిక్రమ్ గారు స్క్రీన్ ప్లే రాసి చెప్పినప్పుడే మా అందరికీ రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

ఈ సినిమా అందరికీ కదిలిస్తుంది. కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. జీవితం అంటే ఏంటో తెలిపేలా ఉంటుంది. సున్నితమైన అంశాలు ఉంటాయి ‘ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు సినిమా మీద అంచనాలు అమాంతం పెంచేలా చేసాయి. ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపిస్తుండగా, సాయి ధరమ్ తేజ్ మరో ముఖ్యమైన పాత్ర పోషించాడు.

ఇక పోతే రీసెంట్ గా విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, కానీ మొన్న విడుదలైన మొదటి పాటకి మాత్రం అభిమానుల నుండి మిశ్రమ స్పందన లభించింది. ఈ విషయాన్నీ థమన్ రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో ఒప్పుకున్నాడు. మొన్న విడుదల చేసిన పాట అభిమానులకు నచ్చలేదని, అన్నీ పాటలు అభిమానులకు నచ్చాలని రూల్ ఏమి లేదని, తర్వాత వచ్చే పాట మాత్రం అభిమానులను రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తుందని చెప్పుకొచ్చాడు.

బ్రో మోషన్ పోస్టర్ లో వచ్చే శ్లోకం మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫ్యాన్స్ ని ఎంతలా ఆకట్టుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ శ్లోకం ఫుల్ వెర్షన్ ని ఈ శనివారం కానీ, లేదా ఆదివారం కానీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. కచ్చితంగా ఈ పాట ఫ్యాన్స్ కి తెగ నాచేస్తుందని థమన్ నమ్మకం మీద ఉన్నాడు. మరి ఆయన నమ్మకం ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

Exit mobile version