Homeఎంటర్టైన్మెంట్Ammu Abhiram: తొలి చూపులోనే ప్రేమలో పడ్డా.. చివరకు సొంతం చేసుకున్నా

Ammu Abhiram: తొలి చూపులోనే ప్రేమలో పడ్డా.. చివరకు సొంతం చేసుకున్నా

Ammu Abhiram: రాక్షసుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై నారప్ప, Fcuk వంటి చిత్రాల్లో హీరోయిన్​గా కనిపించి తన అందం అభినయంతో అభిమానులను సొంతం చేసుకున్న తమిళ బ్యూటీ అమ్ము అభిరామి. అయితే, ఈ అమ్మడు తన ప్రేమ వ్యవహారం గురించి ఇన్​స్టా వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్​ చేసింది. ఈ క్రమంలోనే తన ప్రేమ ఎక్కడ, ఎలా మొదలైంది. అతన్ని ఎలా సొంతం చేసుందో వివరించింది.

మీ అందరికి ఓ స్టోరీ చెప్తాను. 2012లో ఏడో తరగతి చదువుతున్నప్పుడు ఓ రోజు నేను, మా నాన్న విరుగంబాక్కం సిగ్నల్​ వద్ద ఆగాము. అక్కడ మొదటిసారి థార్​ కారును చూసి ప్రేమలో పడిపోయాను. అదే నా మొదటి క్రష్​. ఫస్ట్​ లవ్​. నా మనసంతా అక్కడే ఉండిపోయింది. ఏ కారు కూడా నన్ను అంతలా ఆకట్టుకోలేదు. అప్పటి వరకు కార్లను ఇష్టపడని నేను ఈ కారుతో ప్రేమలో పడిపోయా. అప్పుడు మా నాన్నను ఎవరు ఇతను ఇంత అందంగా ఉన్నాడు అని అడిగాను. మా నాన్న షాక్​ అయ్యారు. ఈ వయసులో  ఎవరి గురించి అడుగుతుంది అని.. కానీ ఆ తర్వాత మా నాన్నకు అర్ధమైంది. నేను కారు గురించి అడుగుతున్నాను అని. అప్పుడు మా నాన్న  ఆ కారు పేరు మహీంద్రా థార్​. సూపర్​ బండి అని చెప్పారు. నా కళ్లన్ని ఆ కారుపైనే ఉన్నాయి.

అప్పుడే ఫిక్స్​ అయ్యాను. ఒకవేళ నేను కార్ కొంటే అది కచ్చితంగా మహీంద్రా థార్ కొనాలని. మా నాన్న నువ్వు కచ్చితంగా ఏదో ఒకరోజు ఆ కారును సొంతం చేసుకుంటావు అని చెప్పారు. 2021లో ఆ కార్ నా దగ్గరకు వచ్చింది. ఇదంతా కలనా ? నిజమా ? అనుకున్నాను. మొత్తానికి నా థార్​ను ఇంటికి తెచ్చుకుననాను.. పదమూడేళ్ల వెనక్కు వెళ్లి నన్ను నేను హగ్ చేసుకుని నువ్వు సాధించావ్ అని చెప్పాలని ఉంది.  ఇలా తన కారు లవ్​స్టోరీ గురించి చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. అందరూ కలలు కనాలని వాటి కోసం కష్టపడాలని సూచించింది. అప్పుడే ఏదో ఒకరోజు విజయం సాధిస్తారని చెప్పుకొచ్చింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular