Jenilia:జెనీలియాను మోసం చేసిన ఆ స్టార్ హీరో కొడుకు..

Jenilia:అల్లరి నటిగా జెనీలియాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సినిమా ఎలా ఉన్నా జెనీలియా నటనకు ప్రతీ సినిమాలో మంచి మార్కులు పడేవి. పాత్రకు తగిన విధంగా నటించి ఆకట్టుకున్నఈ ముద్దుగుమ్మ కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా త్వరలో ఓ డెబ్యూ హీరోతో మళ్లీ వెండితెరపై సందడి చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో జెనీలియా గురించి ఓ న్యూస్ నెట్టింట్ల చక్కర్లు కొడుతోంది. జెనీలియాతో పెళ్లి కాకముందు ఓ స్టార్ […]

Written By: SHAIK SADIQ, Updated On : November 11, 2022 12:47 pm

CREATOR: gd-jpeg v1.0 (using IJG JPEG v62), quality = 100

Follow us on

Jenilia:అల్లరి నటిగా జెనీలియాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సినిమా ఎలా ఉన్నా జెనీలియా నటనకు ప్రతీ సినిమాలో మంచి మార్కులు పడేవి. పాత్రకు తగిన విధంగా నటించి ఆకట్టుకున్నఈ ముద్దుగుమ్మ కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా త్వరలో ఓ డెబ్యూ హీరోతో మళ్లీ వెండితెరపై సందడి చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలో జెనీలియా గురించి ఓ న్యూస్ నెట్టింట్ల చక్కర్లు కొడుతోంది. జెనీలియాతో పెళ్లి కాకముందు ఓ స్టార్ హీరో కొడుకు అసభ్యంగా ప్రవర్తించాడట. తనకు ఇష్టం లేకున్నా ప్రేమించానని వేధించాడట. అయితే చివరికి జెనీలియా ఏం చేసిందో తెలుసా..?

శంకర్ డైరెక్షన్లో వచ్చిన ‘బాయ్స్ ’ సినిమాతో జెనీలియా ఇండస్ట్రీకి పరిచయం అయింది. తెలుగులో ‘సత్యం’తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తెలుగమ్మాయిలా ఉన్న ఈమెను ఇక్కడి ప్రేక్షకులు ఆదరించారు. దీంతో చాలా మంది డైరెక్టర్లు, హీరోలు ఆమెతో నటించడానికి వెంటనే ఓకే చెప్పారు. సినిమాలు ఎలా ఉన్నా జెనీలియా ప్రతి సినిమాలో తన పర్ఫామెన్స్ చూపించేది. కొంతమంది లేడీ ఫ్యాన్స్ జెనీలియా కోసం థియేటర్లోకి వెళ్లిన రోజులున్నాయి. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడం, మలయాళం సినిమాల్లో చేసిన ఈ ముద్దుగుమ్మ హిందీలోనూ అడుగుపెట్టింది.

ఇలా తన కెరీర్ మంచి పొజిషన్లో ఉండగానే మహారాష్ట్ర మాజీ సీఎం తనయుడు రితేశ్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకుంది. వీరికి ఓ బాబు కూడా. పెళ్లి తరువాత సినిమాల్లోకి రాకున్నా పలు అడ్వర్టయిజ్మెంట్లలో భర్తతో కలిసి కనిపిస్తోంది. ఇటు సోషల్ మీడియాలో తన పర్సనల్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటోంది. అయితే జెనీలియాను మళ్లీ సినిమాల్లో చూడాలని కోరుకుంటున్నామని ఫ్యాన్స్ అడగగా.. తప్పకుండా అని రిప్లై ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆమె కన్నడంలో గాలి జనార్దన్ కుమారుడు గాలి కిరీట్ తో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ వేస్తున్నారట. తెలుగులో కూడా ఓ సినిమా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ తరుణంలో జెనీలియా గురించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఆమె సినిమాలు చేస్తున్న సమయంలో ఓ స్టార్ హీరో కొడుకు వేధించేవాడట. తనకు ఇష్టం లేకపోయినా ప్రేమించాలని ఒత్తిడి చేశాడట. దీంతో ఓ సందర్భంలో జెనీలియా అతని చెంప చెల్లుమనిపించింది. ఆ తరువాత ఆ ఇండస్ట్రీని వదిలి తెలుగోలోనే ఎక్కువ సినిమాలు చేసింది. అయితే ఆ తరువాత ఆలస్యం చేయకుండా వెంటనే రితేష్ ను పెళ్లి చేసుకుందని సినీ ఇండస్ట్రీలో టాక్. చిత్ర పరిశ్రమలో ఇలాంటి సంఘటనలు కామన్. కానీ చాలా మంది ఈ విషయాలను బయటపెట్టరు. జెనీలియా మాత్రం తన సన్నిహితుల వద్ద ఈ విషయాన్ని పంచుకోవడంతో అది బయటపడింది.