https://oktelugu.com/

ప్రభాస్‌ బాడీపై శ్రీరెడ్డి హాట్‌ కామెంట్స్‌

కాంట్రవర్సీకి కేరాఫ్‌ అడ్రస్‌ శ్రీరెడ్డి. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో హల్‌చల్ చేశారు. ఇక అప్పటి నుంచి బోల్డ్ బ్యూటీగా మారిపోయారు. ఫిల్మ్‌నగర్ వద్ద అర్ధనగ్నంగా నిరసన ప్రదర్శన చేసి హాట్ టాపిక్ అయ్యారు. పవన్ కల్యాణ్‌పై కామెంట్స్ చేసి తేనేతెట్టేను లేపారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఈ సారి ప్రభాస్ వంతు వచ్చింది. ఆయనపై నెగిటివ్ కామెంట్స్ చేయకపోవడంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. లేదంటే శ్రీరెడ్డి మరో రచ్చ రంబోలా ఉండేది. Also […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 5, 2021 / 01:34 PM IST
    Follow us on


    కాంట్రవర్సీకి కేరాఫ్‌ అడ్రస్‌ శ్రీరెడ్డి. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో హల్‌చల్ చేశారు. ఇక అప్పటి నుంచి బోల్డ్ బ్యూటీగా మారిపోయారు. ఫిల్మ్‌నగర్ వద్ద అర్ధనగ్నంగా నిరసన ప్రదర్శన చేసి హాట్ టాపిక్ అయ్యారు. పవన్ కల్యాణ్‌పై కామెంట్స్ చేసి తేనేతెట్టేను లేపారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఈ సారి ప్రభాస్ వంతు వచ్చింది. ఆయనపై నెగిటివ్ కామెంట్స్ చేయకపోవడంతో ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. లేదంటే శ్రీరెడ్డి మరో రచ్చ రంబోలా ఉండేది.

    Also Read: సుశాంత్ సింగ్ డ్రగ్స్ కేసు.. ఎన్‌సీబీ 30,000 పేజీల చార్జిషీట్..

    ప్రభాస్ సలార్ మూవీకి సంబంధించి విడుదల తేదీ, హీరో లుక్‌ని నిర్మాతలు ప్రకటించారు. ప్రమోషనల్ వీడియోస్ కూడా షేర్ చేశారు. దీనిపై శ్రీరెడ్డి స్పందించారు. ప్రభాస్ బాడీ అంటూ కామెంట్ చేశారు. ఇలా అంటే దిష్టి తగులుతుందేమో కానీ అంటూ ట్వీట్ చేశారు. ఆ బాడీ ఏంట్రా బాబు అలా ఉంది అన్నారు. టీజర్‌లోనే ఇలా ఉంటే ఇంకా సినిమాలో ఫైట్ ఎలా ఉంటుందో అని ప్రభాస్ గురించి తెగ పొగిడేసింది శ్రీ రెడ్డి. వచ్చే ఏడాది సమ్మర్‌లో సలార్ మూవీ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీ రెడ్డి ప్రభాస్‌ను పొగడ్తలతో ముంచెత్తింది. దీనిని ప్రభాస్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మరో అభిమాని అంటూ లోలోన సంబరపడిపోతున్నారు.

    Also Read: మూవీ రివ్యూః క్లైమాక్స్‌

    మరోవైపు శ్రీ రెడ్డి నటించిన క్లైమాక్స్ మూవీ త్వరలో విడుదల కానుంది. ఇందులో రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి నటిస్తున్నారు. అంతేకాదు ఇటీవల ప్యాంట్ విప్పేసి నానా హంగామా చేశారు. ఏ స్టార్‌ని వదలకుండా కామెంట్స్ చేశారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ అతీతులు కారు. వారిపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రం ఇటీవల అనుకూలంగా కామెంట్స్ చేశారు. ఆ తర్వాత ప్రభాస్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తోంది. అంటే చిరు ఫ్యామిలీపై శ్రీ రెడ్డి తన అక్కసును వెళ్లగక్కుతున్నట్టు స్పష్టమవుతోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్