squid game: గేమ్ అనేది చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వారు కూడా చాలా ఆసక్తిగా ఆడుతూ ఉంటారు అయితే గేమ్ ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘స్క్విడ్‌గేమ్’. చిన్నప్పటినుండి మనం ఆడుకున్న గేమ్స్ ను అన్నిటినీ కలిపి ఆరు రకాల గేమ్స్ ను స్క్విడ్‌గేమ్ గా తెరకెక్కించారు.ఈ ఏడాది సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన “స్క్విడ్‌గేమ్” వెబ్ సిరీస్ ఎన్నో రికార్డ్ సృష్టించింది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ వేదికగా రిలీజైన కొరియన్ సిరీస్ ఏకంగా 90 దేశాల్లో ప్రేక్షకులు ఈ సిరీస్‌గా చూడగా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.
https://youtu.be/GdhSQ2bciu0
ఆకట్టుకనే కథా కథనాలు, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో కూడిన ఈ సిరీస్ కారణంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్ర్కైబర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయిందని చెప్పాలి. మొత్తం 9 ఎపిసోడ్స్‌తో కూడిన ఈ సిరీస్‌కి భారతదేశంలో కూడా విపరీతమైన క్రేజ్ లభించింది. అయితే ఈ క్రమంలోనే ‘స్క్విడ్‌గేమ్’ సిరీస్‌ని తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో డబ్ చేయాలని నిర్ణయించుకుంది నెట్‌ఫ్లిక్స్.
ఇందులో భాగంగా ట్రైలర్లను తాజాగా యూట్యూబ్ విడుదల చేసింది. అప్పులతో మీరు బాధ పడాలి అనుకుంటున్నారు అటువంటి జీవితానికి వెళ్లాలి అనుకుంటున్నారు ఈ గేమ్ లో ఆడకూడదు అంటే మాకు ముందే చెప్పాలి మేము ఇచ్చే కోట్ల బహుమతి ఎవరు గెలుచుకున్నారు అంటూ మొదటి గేమ్ రెడ్ గ్రీన్ అండ్ స్టార్ట్ చేస్తారు… మేము ఒకరికి ఒకరు కొట్టుకొని చావాలి అనుకుంటున్నారా అంటూ’.. ఆసక్తికరంగా ఈ ‘స్క్విడ్‌గేమ్’ ట్రైలర్‌ను ముగుస్తుంది త్వరలోనే ఈ సిరీస్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో డబ్ కానుందని నెట్‌ఫ్లి్క్స్ తెలియజేసింది.