Sonal Chauhan: సోనాల్ చౌహన్ కి స్టార్ హీరోయిన్ కి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. కానీ, సోనాల్ మాత్రం ఏవరేజ్ హీరోయిన్ గా కూడా సక్సెస్ కాలేకపోయింది. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా సోనాల్ చౌహన్ కి ఎక్కడా ఆశించిన స్థాయిలో ఛాన్స్ లు రాలేదు, అలాగే బ్రేక్ కూడా రాలేదు. అసలు సోనాల్ చౌహన్ అంటే గ్లామర్ కి మారుపేరు అన్నట్టు ఉంటుంది. మరి ఎందుకు ఆమెకు అవకాశాలు ఇవ్వడం లేదు ?

ఎప్పటికప్పుడు అందాల ఆరబోతలో ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ఏ మాత్రం మొహమాటం లేకుండా విచ్చలవిడిగా రెచ్చిపోతున్న ఈ బ్యూటీని ఎందుకు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు ? కారణం.. ఆమెకు నటన రాకపోవడమా ? అలా అనుకుంటే.. ఎందరో హీరోయిన్లకు ఎలాంటి అవకాశాలు రాకూడదు. అయినా నటన వచ్చిన హీరోయిన్లు ఈ కాలంలో ఎక్కడ ఉన్నారు ? కాబట్టి.. సోనాల్ కి ఛాన్స్ లు రాకపోవడానికి కారణం.. ఆమెకు ఉన్న నటనలో బలహీనత కాదు.
మరి ఏమిటి కారణం ? ఈ ప్రశ్న దగ్గరే సోనాల్ గత పదేళ్లుగా ఆగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు వచ్చిన అవకాశం దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న ‘ది ఘోస్ట్’ సినిమా. కాగా ఈ సినిమాలో తన అందచందాల ప్రదర్శనతో అడ్డుఅదుపు లేకుండా విచ్చలవిడిగా రెచ్చిపోతుంది ఈ బ్యూటీ. పైగా ఈ బ్యూటీ ఎక్స్ పోజింగ్ తో పాటు పవర్ ఫుల్ ఫైట్లు కూడా చేస్తుందట.
నిజానికి ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించాలి. కాకపోతే, కాజల్ గర్భవతి కావడంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. చివరకు ఏ హీరోయిన్ సెట్ కాలేదు. తక్కువ బడ్జెట్ లో చేసే హీరోయిన్ కోసం అన్వేషణ చేస్తున్న క్రమంలో సోనాల్ చౌహన్ నేను ఉన్నాను అంటూ ఈ సినిమా ఒప్పుకొంది.
మరి అవకాశాలు లేవు సోనాల్ కి, అందుకే వెంటనే ఒప్పుకొంది. యాక్షన్ చేయాల్సి ఉంటుంది అంటే.. నేను యాక్షన్ కైనా, గ్లామర్ షోకైనా.. అసలు దేనికైనా నేను ఎప్పుడూ రెడీనే అంటుంది. మొత్తమ్మీద ఈ సినిమా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ కానుంది. వచ్చే వారం నుంచి దుబాయ్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.