Ram Charan: శంకర్ తో సినిమా చేయడం కంటే ఖాళీ గా కూర్చోవడం బెటర్ : రామ్ చరణ్

మగధీర తో నట విశ్వరూపాన్ని చూపించిన ఆయన రంగస్థలంలో చిట్టి బాబు అనే పాత్ర లో ఓదిగిపోయి నటించాడు. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకం గా నటన లో ఒక శిఖరాన్ని అధిరోహించాడనే చెప్పాలి.

Written By: Gopi, Updated On : November 9, 2023 8:15 am

Ram Charan

Follow us on

Ram Charan: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ అందరికీ చిరంజీవి అంటే విపరీతమైన అభిమానం ఉంటుంది. ఎందుకంటే ఆయన స్వయంకృషితో ఇండస్ట్రీకి వచ్చి తనదైన రీతిలో స్టార్ డమ్ సంపాదించుకున్నారు కాబట్టి ఆయన అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. ఇక ఆయన నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం హీరోగా రాణిస్తూ చాలా మంచి సక్సెస్ లను అందుకుంటున్నాడు.

మగధీర తో నట విశ్వరూపాన్ని చూపించిన ఆయన రంగస్థలంలో చిట్టి బాబు అనే పాత్ర లో ఓదిగిపోయి నటించాడు. ఇక త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకం గా నటన లో ఒక శిఖరాన్ని అధిరోహించాడనే చెప్పాలి.ఇక ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా హీరోగా తన స్టార్ డమ్ ని విస్తరించుకున్నారు.ఇక రాజమౌళి తీసిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు తమిళ్ డైరెక్టర్ అయిన శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు.

శంకర్ అంటేనే భారీ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ లాంటివాడు ఇక అలాంటిది శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు అంటే రామ్ చరణ్ తన తదుపరి చిత్రం తో కూడా భారీ సక్సెస్ ని అందుకోబోతున్నాడు అనే అభిప్రాయాలైతే వెళ్ళడవుతున్నాయి.ఇక దీనికి తోడుగా శంకర్ కి భారతీయుడు 2 అనే సినిమా కూడా తెరకెక్కిస్తున్నాడు. కమల్ హాసన్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా పైన కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమా స్టార్ట్ అయి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్న కూడా ఇప్పటికి ఆ సినిమా షూట్ ఇంకా పూర్తి కాకపోవడంతో రామ్ చరణ్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు.ఇక దానితో విసిగిపోయిన రామ్ చరణ్ తన సన్నిహితులతో ఫన్నీగా శంకర్ తో సినిమా చేయడం కంటే ఓ రెండు సంవత్సరాలు ఖాళీగా ఇంట్లో కూర్చోవడం బెటర్ అంటూ కామెంట్ చేసినట్టుగా తెలుస్తుంది.అయితే చరణ్ జోక్ గానే ఆ కామెంట్ చేసినప్పటికీ అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమా కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ బుచ్చిబాబు సినిమా మీద తన మొత్తం ఫోకస్ పెట్టాలని చూస్తున్నాడు.

ఇక ఇప్పటికి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేకపోవడంతో బుచ్చిబాబు సినిమా చేయలేకపోతున్నాడు. అటు ఆ సినిమా పూర్తి అవ్వక, ఇటు ఈ సినిమా షూట్ స్టార్ట్ చేయలేక రామ్ చరణ్ కి ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక గేమ్ చెంజర్ సినిమాకు సంబంధించిన షూట్ ఇంకా 50% వరకు బ్యాలెన్స్ గా ఉండడంతో ఆ సినిమా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాతే బుచ్చిబాబు సినిమాని తెరకెక్కించాలని చూస్తున్నాడు…