Shobhita Dulipalla : అసలు నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ళకు ఎలా జతకుదిరింది అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. వీరు కలిసి ఒక్క సినిమా చేయలేదు. పైగా శోభిత ఎక్కువగా ముంబైలో ఉంటారు. మోడల్ గా శోభిత కెరీర్ మొదలైంది అక్కడే. రెండేళ్లకు పైగా నాగ చైతన్య, శోభిత మధ్య సంథింగ్ సంథింగ్ అనే వార్తలు వస్తున్నాయి. కానీ ఈ జంట ఖండించారు. ఆగస్టు 8న సడన్ గా నిశ్చితార్థం జరుపుకున్నారు. డిసెంబర్ 4న అత్యంత సన్నిహితులు, బంధు మిత్రుల సమక్షంలో వివాహం జరిగింది. కేవలం 300 మందిని మాత్రమే ఆహ్వానించారు.
వివాహ బంధంలో అడుగుపెట్టిన శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. అసలు నాగ చైతన్యను ప్రేమించడానికి, పెళ్లి చేసుకోవడానికి కారణాలు చెప్పింది. నేను ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ప్రేమ నాగ చైతన్య రూపంలో నాకు దక్కింది. నాగ చైతన్య భర్తగా రావడం నా అదృష్టం. ఆయనలోని సింప్లిసిటీ, మంచి మనసు, దయ, ఇతరులను గౌరవించే తత్త్వం, హుందాతనం నాకు బాగా నచ్చాయి. నన్ను ఎంతగానో ప్రేమిస్తాడు. చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు అని ఆమె అన్నారు.
తన వ్యక్తిగత సంగతులు కూడా శోభిత పంచుకున్నారు. నాకు భక్తి ఎక్కువే. మనసుకు భారంగా ఉంటే, ఎవరో ఒకరిని తోడు తీసుకుని గుడికి వెళతాను. భరతనాట్యం, కూచిపూడి నేర్చుకున్నాను. ఇంట్లో డాన్స్ చేస్తుంటాను. పుస్తకాలు చదవడం, కవితలు రాయడం కూడా నా వ్యాపకాలని శోభిత వెల్లడించారు. నాకు వంట బాగా వచ్చు. నేను చేసిన వంటలు ఎవరైనా లొట్టలేసుకుని తినేస్తారు. ఆవకాయ, ముద్ద పప్పు, పులిహోర, పచ్చిపులుసు శోభితకు ఇష్టమైన వంటకాలు అట.
కెరీర్ బిగినింగ్ లో అనేక మందితో తిరస్కరణకు గురయ్యాను. అవమానకర సంఘటనలు ఎదురయ్యాయి. నేను వచ్చిన ప్రతి సినిమా ఆఫర్ కి సైన్ చేయను. స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తాను. ఎప్పుడూ సిల్వర్ స్క్రీన్ పై కనిపించాలనే కోరిక నాకు లేదని శోభిత అన్నారు. కాగా శోభిత తెలుగులో గూఢచారి, మేజర్ చిత్రాల్లో నటించింది. గూఢచారి 2 లో సైతం ఆమె నటిస్తున్నారని సమాచారం. శోభిత తెలుగు అమ్మాయి కాగా, ఆంధ్రప్రదేశ్ లోని తెనాలిలో పుట్టింది.