Sardar Collections: తమిళ హీరో కార్తీ నటించిన ‘సర్దార్’ సినిమా ఇటీవలే తెలుగు మరియు తమిళం బాషలలో ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..కార్తీ కెరీర్ ప్రస్తుతం మాములు ఊపు లో లేదు..ఒక్క తెలుగు లోనే కాదు..ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఈమధ్య కాలం లో మూడు నెలలకు మూడు సినిమాలను విడుదల చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన ఏకైక హీరో కార్తీ మాత్రమే..ఆయన హీరో గా నటించిన ‘వీరుమాన్’ చిత్రం ఆగష్టు 12 వ తేదీన విడుదలై తమిళనాడు బాక్స్ ఆఫీస్ ని ఒక ఊపు ఊపి వంద కోట్ల రూపాయిలను వసూలు చేసింది.

ఇక తదుపరి నెలలో మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ సెప్టెంబర్ 30 వ తారీఖున విడుదలైంది..ఇది బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అలా వరుసగా రెండు నెలల్లో రెండు హిట్స్ కొట్టి మంచి ఊపు మీదున్న కార్తీ కి ఇప్పుడు సర్దార్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ నిలవడం తో..మూడు నెలల్లో మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన ఏకైక నేటి తరం హీరోగా సరికొత్త చరిత్ర సృష్టించాడు కార్తీ.
ఇక కార్తీ కి తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఆవారా సినిమా నుండే ఆయనకీ ఇక్కడ అద్భుతమైన మార్కెట్ ఉంది..కార్తీ సినిమా అంటే తెలుగు వాళ్ళు తమ సొంత తెలుగు హీరో సినిమా లాగానే చూస్తారు..ఆ అభిమానం ఇంకా చెక్కు చెదరలేదని నిరూపించింది ‘సర్దార్’ చిత్రం..ఈ సినిమా విడుదల రోజే మరో మూడు సినిమాలు కూడా విడుదలయ్యాయి..మూడు సినిమాలకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది..కానీ ఆ మూడు సినిమాలకంటే మొదటి రోజు నుండి బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీ వసూళ్లను సాధిస్తున్న సినిమా మాత్రం ‘సర్దార్’ ఒక్కటే.

ఈ సినిమా తెలుగు రైట్స్ ని అక్కినేని నాగార్జున గారు సుమారు 4 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసాడు..మొదటి మూడు రోజుల్లోనే నాగార్జున గారు ఈ సినిమాకి పెట్టిన డబ్బుల్లో 90 శాతం రికవరీ చేసింది..మూడు రోజుల్లో సుమారుగా 3 క్తోల రూపాయిల వసూలు చేసిన ఈ సినిమా, రేపు దీపావళి అవ్వడం తో రేపటి తో పూర్తి స్థాయి బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి , కార్తీ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవబోతుంది.