Site icon OkTelugu

Samantha Ruthuprabhu: మరో కథకు సమంత గ్రీన్ సిగ్నల్ !

Samantha Akkineni

 

Samantha Ruthuprabhu: ఒకపక్క సమంత (Samantha) వ్యక్తిగత జీవితం పై అనేక పుకార్లు పుట్టుకొస్తున్నా.. మరోపక్క సమంత మాత్రం వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ పోతుంది. హీరోయిన్ సమంతలో మొత్తానికి చాలా మార్పు వచ్చింది. కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలకే ఆమె కేరాఫ్‌ అడ్రెస్ గా మారింది. ఇప్పటికే ‘శాకుంతలం’ సినిమాని పూర్తి చేసింది. ఇప్పుడు మరో వైవిధ్యమైన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కాగా శ్రీదేవి మూవీస్‌ పతాకం పై శివలెంక కృష్ణప్రసాద్‌ ఈ సినిమాని నిర్మించనున్నారు. ఇక సమంత ఈ సినిమాకి వెంటనే అంగీకరించడానికి ముఖ్య కారణం.. ఈ కథ వినూత్నంగా ఉంటుందట. ఇక నవంబర్‌ నుంచి ఆ సినిమా షూటింగ్ మొదలుకానుంది. అలాగే ఈ మధ్య వరుసగా యాడ్ ఫిల్మ్స్ చేస్తోంది. ప్రస్తుతం సమంత చేతిలో చాలా బ్రాండ్ లున్నాయి.

అలాగే తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో కూడా డిజిటల్ ప్రమోషన్స్ చేస్తూ ఆ రకంగానూ బాగా సంపాదిస్తోంది. మొత్తానికి పర్సనల్ లైఫ్ పై అనేక రూమర్స్ వస్తున్నా.. సామ్ మాత్రం తన సంపాదనను ఆపడం లేదు. ఇక సమంత అల్ట్రా స్టైలిష్ లుక్ లో హాట్ ఫోజులతో ఫ్యాన్స్ కి ఎప్పటికప్పుడు సర్ ప్రైజ్ ఇస్తూ పోతూ ఉంది.

కానీ త్వరలోనే సమంత – చైతు విడిపోతున్నారని వస్తోన్న ప్రచారంలో వాస్తవం ఎంత అనేది ఇంతవరకు క్లారిటీ రాలేదు. మరి, ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందనేది తెలియాలంటే.. సమంత అధికారికంగా నోరు విప్పాల్సిందే. ప్రస్తుతానికి అయితే సమంత, చైతుతో కలిసి ఉండటం లేదు అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Exit mobile version