
డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ అనగానే మనకు ముందు గుర్తుకు వచ్చేది ‘పూరి జగన్నాదే’. అయితే, మనమే కాదు, బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా పూరి జగన్నాద్ ను డేరింగ్ డైరెక్టర్ అనే అంటున్నారు. పూరి రాసే కథలు మాటలు తమకు ఇష్టం అంటూ గతంలో అమితాబ్ చెప్పాడు. కాగా తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పూరితో ఒక సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. పూరి సినిమాలను తానూ రెగ్యులర్ గా చూస్తుంటాను అని, అతని క్యారెక్టర్స్ నాకు బాగా నచ్చుతాయి అంటూ సల్మాన్ మొత్తానికి పూరితోనే కథ ఉంటే చెప్పమని ఆఫర్ ఇచ్చాడు.
మరి పూరి చెప్పే కథ గాని, సల్మాన్ కి నచ్చితే.. వీరి కలయికలో క్రేజీ సినిమా రావడం పక్కా. నిజానికి పూరితో సినిమా చేయాలని సల్మాన్ ఎప్పటినుండో అనుకుంటున్నాడు. తానూ హీరోగా వచ్చిన దబాంగ్ 3 చిత్రం ప్రమోషన్ లో పాల్గొన్న సమయంలోనే సల్మాన్ ఖాన్ మీడియా అందరి ముందు కూర్చుని మాట్లాడుతూ.. నాకు పూరి జగన్నాద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనీ ఉందని ఓపెన్ గా చెప్పాడు. బాలీవుడ్ స్టార్ హీరో అంత ఓపెన్ గా చెప్పాకా పూరి కూడా సల్మాన్ కోసం ఆ మధ్య కథ రాశాడు. అయితే కథలో కొంత బ్యాలెన్స్ ఉంటే.. లాక్ డౌన్ లో కూర్చుని మొత్తం కథనే ఫైనల్ చేశాడట.
ఇప్పుడు ఆ కథనే సల్మాన్ కి చెప్పనున్నాడు. మరి సల్మాన్ కి కథ నచ్చితే.. సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఎలాగూ ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన పూరి, ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో లైగర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. బహుశా ఈ సినిమా తరువాతే సల్మాన్ తో సినిమా చేస్తాడేమో. ఇక పూరి మహేష్ తో తీసిన పోకిరి చిత్రాన్ని సల్మాన్ హిందీలో వాంటెడ్ గా రీమేక్ చేసి సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుండో పూరి అంటే సల్మాన్ కి ప్రత్యేక అభిమానం ఉంది. ఆ కారణంగానే పూరి సినిమాల పై సల్మాన్ ప్రత్యేకమైన ఫోకస్ పెడుతుంటాడు.