https://oktelugu.com/

Devara: దేవర అంత బాగానే ఉంది కానీ సైఫ్ ఆలీ ఖాన్ వల్ల మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే ప్రతి రోజు అప్డేట్ అవుతూ దర్శకుడు తనకంటూ ఒక గుర్తింపు ను పొందటానికి సిద్ధం గా ఉంటాడు.అలాగే సమాజం పట్ల కూడా వాళ్లకు చాలా మంచి అవగాహన అయితే ఉండాలి....

Written By:
  • Gopi
  • , Updated On : August 17, 2024 / 10:31 AM IST

    Devara(6)

    Follow us on

    Devara: తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో దేవర అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుందంటూ సినిమా యూనిట్ ప్రచారం అయితే చేస్తుంది. ఇక రీసెంట్ గా సైఫ్ అలీ ఖాన్ బర్త్ డే సందర్భంగా ఆయన కు సంభందించిన ఓం గ్లింప్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా అలరించడమే కాకుండా యూట్యూబ్ లో భారీ హైప్ ను క్రియేట్ చేస్తుంది. ఒక బలమైన విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ పాత్రలో నటించడమే కాకుండా తన హవ భావాలతో ప్రేక్షకులను కట్టిపడేసాడు. ఇక చిన్న టీజర్ లోనే నట విశ్వరూపం చూపించిన సైఫ్ ఇక సినిమా మొత్తం లో చెలరేగిపోయి పర్ఫామెన్స్ ఇస్తాడు అనడం లేదు ఎలాంటి అతిశయోక్తి అయితే లేడు. ఇక ఇదిలా ఉంటే మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి మంచి నటుడి గా గుర్తింపు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక తనకి దొరికిన ఈ ప్రతినాయకుడి పాత్రని చాలా రిస్క్ చేసి మరి చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ పాత్రని చూపించడమే కాకుండా కొరటాల శివ దానిమీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ సినిమాను డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ప్రతి నాయకుడి పాత్ర అంత స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు దానికి అనుగుణంగా హీరో పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. లేకపోతే మాత్రం విలన్ హీరోని డామినేట్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. అందువల్లే సినిమా మీద హైప్ తీసుకురావడానికి సైఫ్ అలీ ఖాన్ పాత్ర చాలా వరకు హెల్ప్ అయింది.

    కానీ సినిమాలో ఎన్టీయార్ చేసిన క్యారెక్టర్ సైఫ్ కంటే స్ట్రాంగ్ గా ఉండకపోతే మాత్రం సినిమా నిరాశ పరుస్తుందని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అందుకే ఈ సినిమా మీద కొంచెం లేట్ అయినా కూడా కొరటాల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక విలన్ పాత్ర కంటే హీరో పాత్ర కనీసం ఒక 10% అయిన ఎక్కువగానే ఉండాలి. ఒకవేళ కనక తేడా కొట్టినట్లైతే సినిమా మొత్తానికి దెబ్బపడే అవకాశాలైతే ఉన్నాయి.

    ఇక కొన్ని యాంగిల్స్ లో చూస్తే సైఫ్ అలీ ఖాన్ పాత్ర సినిమాకి మైనస్ గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి… మరి దర్శకుడు ఇలాంటి ఈ పాత్రకు తగ్గట్టుగా హీరో క్యారెక్టర్ ను డిజైన్ చేశాడా లేదా అనేది తెలియాలంటే సెప్టెంబర్ 27వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…అయితే ఈ సినిమాతో సక్సెస్ కొడితే కొరటాల శివ కూడా స్టార్ డైరెక్టర్ గా మారిపోతాడు…