Site icon OkTelugu

Sai Dharam Tej Bro Movie: మామయ్య పవన్ తో నటిస్తూ… సాయి ధరమ్ తేజ్ తాగి సెట్స్ కి వచ్చాడా? ఇంట్రెస్టింగ్ మేటర్ లీక్!

Sai Dharam Tej Bro Movie

Sai Dharam Tej Bro Movie

Sai Dharam Tej Bro Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా “బ్రో”.. ఈ వీకెండ్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ గురించి ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమా కి హీరో సాయి ధరమ్ తేజ్ తాగి సెట్ కి వచ్చి పవన్ కళ్యాణ్ తో నటించాడా ? అయితే ఈ అనుమానం వ్యక్తం చేసింది దర్శకుడో లేక సినిమా యూనిట్ కాదు, ఏకంగా పవన్ కళ్యాణ్..

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ ఇంట్రస్టింగ్ మ్యాటర్ గురించి సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘ఇందులో కేక్ తినిపించే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఆ సన్నివేశంలో బాగా ఇబ్బంది పడ్డాను, ఆ తర్వాత మందు తాగి పవన్ కళ్యాణ్ ముందు నటించాలి. కాస్త ఇబ్బంది పడినా కానీ, ఆ సీన్ పర్ఫెక్ట్ గా వచ్చింది. ఆ సన్నివేశం అయిన తర్వాత కళ్యాణ్ మామయ్య నా దగ్గరికి వచ్చి తాగి సెట్ కి వచ్చావా ? అని అడిగాడు. లేదని చెప్పను, బాగా చేశావని మెచ్చుకుంటూనే, తాగుడు మీద మంచి పట్టుంది అంటూ’ ఆట పట్టించాడు.

కళ్యాణ్ మామయ్య నన్ను ఇలా ఆట పట్టిస్తుంటే మాకు తెలియకుండా దర్శకుడు సముద్రఖని వాటిని షూట్ చేశాడు . అలాంటి సన్నివేశాలు సినిమాలో మూడు నాలుగు చోట్ల ఉంటాయి. రియల్ లైఫ్ లో కళ్యాణ్ మామయ్యకి నాకు బాండింగ్ బాగా ఉంటుంది. ఈ సినిమాలో కూడా మా బాండింగ్ చాలా బాగుంటుందని తెలిపాడు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో లాజిక్ లు పక్కన పెట్టి మా బాండింగ్ ని, తెర మీద వచ్చే సన్నివేశాలు చూసి ఎంజాయ్ చేయండి అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా తర్వాత హీరో సాయి ధరమ్ తేజ్ దాదాపు 6 నెలలు సినిమాలకు గ్యాప్ తీసుకునే అవకాశం ఉందని, గతంలో జరిగిన యాక్సిడెంట్ వలన శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తేజ్, దానికి సంబంధించిన మరో సర్జరీ చేపించుకునే అవకాశం ఉందని, అదే విధంగా తన ఫిజిక్ మీద దృష్టి పెట్టి తదుపరి సినిమాకు సిద్ధం కాబోతున్నాడు. వచ్చే ఏడాది మొదట్లో దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో తన కొత్త మొదలు పెట్టే ఆలోచనలో సాయి ధరమ్ తేజ్ ఉన్నట్లు సమాచారం.

Exit mobile version