https://oktelugu.com/

Republic Movie : ‘రిపబ్లిక్’ మూవీపైనే అందరి కళ్లు.. ఏం జరగనుంది?

Republic Movie : ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న స్పీచ్ తో ‘రిప‌బ్లిక్’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయింది. సినిమా ఇండ‌స్ట్రీకి సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ.. ప్ర‌భుత్వ తీరును తూర్పార‌బ‌ట్టారు ప‌వ‌న్‌. ఆ ప్ర‌కంప‌న‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. దీంతో.. రిప‌బ్లిక్ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అక్టోబ‌ర్ 1న రిలీజ్ కాబోతున్న‌ ఈ చిత్రంపైనే అంద‌రి దృష్టి ప‌డింది. మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా న‌టించిన చిత్రం […]

Written By:
  • Rocky
  • , Updated On : September 28, 2021 / 11:51 AM IST
    Follow us on

    Republic Movie : ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న స్పీచ్ తో ‘రిప‌బ్లిక్’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయింది. సినిమా ఇండ‌స్ట్రీకి సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ.. ప్ర‌భుత్వ తీరును తూర్పార‌బ‌ట్టారు ప‌వ‌న్‌. ఆ ప్ర‌కంప‌న‌లు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. దీంతో.. రిప‌బ్లిక్ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అక్టోబ‌ర్ 1న రిలీజ్ కాబోతున్న‌ ఈ చిత్రంపైనే అంద‌రి దృష్టి ప‌డింది.

    మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా న‌టించిన చిత్రం రిప‌బ్లిక్‌. ప్ర‌స్థానం చిత్రంతో ప్ర‌తిభ‌ను చాటుకున్న ద‌ర్శ‌కుడు దేవా క‌ట్టా.. ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ మూవీలో తేజూ క‌లెక్ట‌ర్ గా క‌నిపించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఇక‌, ట్రైల‌ర్ కూడా సినిమా తీరేంటో చెప్ప‌క‌నే చెబుతోంది. రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల్లోని లోపాల‌ను క‌డిగిపారేసే మూవీగా ఈ చిత్రం నిలుస్తుందనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

    ఇటు, హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ లేకుండానే సినిమా ప్ర‌మోష‌న్ జ‌రుగుతోంది. విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది. దీంతో.. సానుభూతి కూడా వ‌ర్క‌వుట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా.. ఆసుప‌త్రిలో ప‌డిఉన్న తేజూకు ఈ చిత్రం హిట్ తో బ‌హుమ‌తి ఇవ్వాల‌ని మెగా ఫ్యాన్స్ ఆరాట‌ప‌డుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో విడుద‌ల‌వుతున్న రిప‌బ్లిక్ సినిమాపైనే అంద‌రికీ క‌ళ్లూ ఉన్నాయి.

    ఈ శుక్ర‌వారం రిప‌బ్లిక్‌ చిత్రంలోపాటు మ‌రికొన్ని సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ‘అస‌లేం జ‌రిగిందంటే’, ‘ఇదే మా కథ’ వంటి సినిమాలు ఈ వార‌మే విడుద‌ల కాబోతున్నాయి. మ‌రి, ఈ చిత్రాల్లో ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ చూర‌గొనేవి ఏవీ అన్న‌ది చూడాలి.