RRR Movie Child artist Malli Real Name: త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయి ఇండియన్ బాక్సాఫీసును బద్దలు కొడుతుంది. దీంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ సినిమాలో చేసిన ప్రతి పాత్ర ప్రేక్షకులకు గుర్తిండిపోయేదే. హృదయాలను హత్తుకునే ఎమోషనల్ సీన్స్ ప్రతి పాత్రలో ఉండటంతో ప్రేక్షకులు ఆయా పాత్రలకు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఈ కథ మొత్తం గోండు జాతి పిల్ల మల్లి చుట్టే తిరుగుతుంది. కథను మలుపు తిప్పే పాత్ర మల్లిదే.

గోండు జాతి పిల్ల అయిన మల్లిని బ్రిటిష్ వారు ఎత్తుకుపోయి తమ వద్ద బానిసగా పెట్టుకుంటారు. దీంతో ఆమెను విడిపించుకుని రావడానికి కొమరం భీమ్ మారువేషంలో ఢిల్లీకి బయలు దేరుతాడు. అత్యంత ప్రమాదకరమైన కాపర్ గా పేరు తెచ్చుకున్న కొమరం భీమ్ ను పట్టుకునే బాధ్యతను స్పెషలాఫీసర్ అయిన రామరాజుకు బ్రిటిష్ వారు అప్పగిస్తారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య సాగే స్నేహం, ఆ తర్వాత వీరిద్దరి మధ్య వచ్చే విభేదాలతో సినిమా కథ మొత్తం నడుస్తుంది.
Also Read: RRR: బాహుబలికి ఉన్న ఊపు ‘ఆర్ఆర్ఆర్’కు ఎందుకు లేదు?

మొత్తంగా చెప్పాలంటే మల్లిని విడిపించుకోవడానికి కొమురం భీం చేసే ప్రయత్నాలు, వాటిని అడ్డుకునేందుకు రామరాజు చేసే అడ్డంకుల చుట్టే సినిమా కథ మొత్తం నడుస్తుంది. మొదటి నుంచి చివరి వరకు మల్లి పాత్ర ఉంటుంది. దీంతో ఈ పాత్ర పోషించిన అమ్మాయి ఎవరు అని ప్రేక్షకులు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. ఈ అమ్మాయిని ఏరికోరి రాజమౌళి సినిమాలో ఎందుకు పెట్టుకున్నాదంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

ఈ అమ్మాయి పేరు ట్వింకిల్ శర్మ. ఈమె ఇంతకు ముందు డాన్స్ ఇండియా డాన్స్ లాంటి రియాల్టీ షోలో పాల్గొన్నారు. ఆ తర్వాత బెస్ట్ డ్రామా బాజ్ లాంటి రియాల్టీ షోలో పాల్గొని చివరి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ లో ఒకరిగా మిగిలి పాపులర్ అయింది. ఈమె ఇప్పటివరకు ఎన్నో టీవీ రియాల్టీ షోలలో పాల్గొంది. ఫ్లిప్ కార్ట్ లాంటి యాడ్ లలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ సినిమా ప్రారంభం అయినప్పుడు ఆమె 8వ తరగతి చదువుతుండేదట. త్రిబుల్ ఆర్ రిలీజ్ అయ్యే సమయానికి ఆమె ఇంటర్ చదువుతున్నట్టు తెలుస్తోంది. ఇక మల్లి పాత్రలో ఆమె పండించిన హావభావాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాతో ఆమె ఫ్యాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ తెచ్చుకుంది. ఆమెకు మరిన్ని సినిమా ఛాన్స్ లు వచ్చే అవకాశం లేకపోలేదు.
Also Read: Social Updates: అందాల తారల లేటెస్ట్ క్రేజీ పోస్ట్ లు



[…] […]
[…] Ram Charan Screen Time With Chiranjeevi In Acharya: మెగాస్టార్ చిరంజీవి, – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకే ప్రైమ్ లో కలిసి శత్రువుల పై కలిసికట్టుగా ఫైట్ చేస్తే చూడటానికి అద్భుతంగా ఉంటుంది కదా.. క్లాస్ డైరెక్టర్ కొరటాల శివ ఆ అద్భుతాన్ని ఆచార్య రూపంలో నిజం చేయబోతున్నాడు. ఆచార్యలో చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాగా చరణ్ పాత్ర ఈ సినిమాలో ఎంతసేపు ఉంటుందో లీక్ అయింది. […]
[…] KGF-2 Trailer Creates Record In Telugu: `కేజీఎఫ్ చాప్టర్- 2` ట్రైలర్ 24 గంటల్లోనే 109 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డుల మోత మోగించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ట్రైలర్ 24 గంటల్లో.. తెలుగులో 20 మిలియన్ల వ్యూస్ ను, కన్నడలో 18 మిలియన్ల వ్యూస్ ను, తమిళ్‌లో 12 మిలియన్ల వ్యూస్ ను, మలయాళంలో 8 మిలియన్ల వ్యూస్ ను సాధించింది. అయితే, కేజీఎఫ్ ఒక కన్నడ సినిమా. […]