Irumudi release date update: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో ప్రస్తుతం కెరీర్ లో గడ్డు కాలాన్ని ఎదురుకుంటున్న టాప్ హీరోల్లో ఒకరు మాస్ మహారాజ రవితేజ. ఆయన గత చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఈ సంక్రాంతి కానుకగా విడుదలై పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఆయన ముందు సినిమాలతో పోలిస్తే టాక్ కాస్త బెటర్ గానే వచిన్నప్పటికీ , ఆడియన్స్ ఎందుకో రవితేజ ని నమ్మలేదు. ఇప్పుడు రీసెంట్ గా ఆయన ‘ఇరుముడి’ అనే చిత్రాన్ని ఒప్పుకున్నాడు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. పైగా సుబ్రమణ్య స్వామి నేపథ్యం లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు అనే క్లారిటీ ఇవ్వడం తో హైప్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. ఈ చిత్రం ఎప్పుడు విడుదలైనా రవితేజ కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుంది , అందులో ఎలాంటి సందేహం లేదు.
ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీ పై మేకర్స్ ఒక క్లారిటీ కి వచ్చినట్టు తెలుస్తోంది. ఆగస్టు నెలలో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని చూస్తున్నారట. అది మొదటి వారం లో విడుదల చెయ్యాలా?, లేదంటే ఆగస్టు 14 న విడుదల చెయ్యాలా అని ఆలోచిస్తున్నారట. ఆగస్టు 14 న విడుదల చేస్తే, 15 న స్వాతంత్ర దినోత్సవం కలిసి వస్తుంది , టాక్ తో సంబంధం లేకుండా బ్రేక్ ఈవెన్ మార్కుని అవలీలగా అందుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది , ఆగస్టు 24 న నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్ ‘ మూవీ విడుదల కాబోతుంది. ఈ చిత్రం పై ఆడియన్స్ లో ఎలాంటి హైప్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకవేళ ఆగస్టు 14 న విడుదల చేస్తే, కేవలం 10 రోజుల థియేట్రికల్ రన్ మాత్రమే ఉంటుంది.
ఆ తర్వాత ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి , మంచి రన్ ఉన్నప్పటికీ కూడా థియేటర్స్ ని తొలగించి , ‘ది ప్యారడైజ్’ కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే కంటెంట్ మీద బలమైన నమ్మకం తో ఆగస్టు మొదటి వారం లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తే , పాజిటివ్ టాక్ మీద 3 వారాల బలమైన థియేట్రికల్ రన్ ని చూడొచ్చు. కాబట్టి మేకర్స్ మొదటి వారం లోనే విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ విడుదల తేదికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయబోతున్నారట మేకర్స్.
