Rathika Rose- Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభంలోని ఏకంగా నాగార్జునతోటే పులిహార కలిపిన రాధిక ఇప్పుడు హౌస్ లో కొత్త లవ్ స్టోరీ కి తెరలేపింది. బిగ్ బాస్ సీజన్ అంటేనే హౌస్ లో ఏదో ఒక ప్రేమ జంట ఉండటం పరిపాటిగా మారింది. అయితే హౌస్ లో ప్రేమ పక్షులు ఎగరడానికి కాస్త వ్యవధిపట్టేది కానీ ఈసారి ఈ అడ్వాన్స్ సీజన్లో మూడో ఎపిసోడ్ కల్లా ప్రేమపక్షులు ఒకటిగా చేరిపోయాయి. గత బిగ్ బాస్ సీజన్ వైఫల్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి పకడ్బందీగా కంటెస్టెంట్స్ దగ్గర నుంచి కంటెంట్ వరకు ఎంతో ప్లాన్డ్గా నిర్వాహకులు ఈ సిరీస్ మొదలుపెట్టారు.
మొత్తం ఈసారి 14 మంది కంటెస్టెంట్స్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో ప్రస్తుతం ప్రేక్షకులు అందరి దృష్టి ఇద్దరిపై కేంద్రీకృతమై ఉంది. అందులో ఒకరు రతికా రోజ్ …మరొకరు రైతు బిడ్డ గా హౌస్ లోకి ఎంటర్ అయిన పల్లవి ప్రశాంత్. ఇద్దరూ వచ్చిన రోజు నుంచే బాగా ఫ్రెండ్స్ గా మారారు. మొదట్లో హౌస్ లో అడ్జస్ట్ అవ్వడానికి కాస్త ఇబ్బంది పడిన పల్లవి ప్రశాంత్ కు రతికా మంచి సపోర్ట్ గా నిలిచింది. దీంతో ఈ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఇక అప్పటినుంచి ఇద్దరు హౌస్ లో ఎంతో క్లోజ్ గా మూవ్ అవుతున్నారు .
తాజాగా జరిగిన ఎపిసోడ్ లో ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ పక్క పక్కన కూర్చొని ఉండగా అక్కడికి ప్రత్యక్షమైన రతికా రోజ్ ‘హేయ్ ప్రశాంత్ ఒకటి అడుగుతా చెప్పు. నువ్వు ఏ అమ్మాయికి నీ దిల్ ఇస్తావు’అంటూ ప్రశాంత్ ను ప్రశ్నించింది. అంతటితో వదలకుండా ‘ఇక్కడనా? బయటనా’… అంటూ నానా హడావిడి చేసింది. సడన్గాలాంటి ప్రశ్న అడగడంతో తెగ సిగ్గు పడిపోయిన ప్రశాంత్ ,ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాక.. నా సంగతి సరే నీ దిల్ ఎవరికి ఇస్తావు అని ఎదురు ప్రశ్న వేశాడు.
అమ్మాయి అయినా ..రతికా కాస్త కూడా జంకు బొంకు లేకుండా తప్పిమని నీకే ఇస్తా అంటూ రిప్లై ఇచ్చేసింది. అయితే ప్రశాంత్ మాత్రం ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా దాటేశాడు. అక్కడే ఉండి ఇదంతా గమనిస్తున్న ప్రిన్స్ ఉండబట్టలేక లవ్ ఒక్కటేనా మ్యారేజ్ కూడానా అని రతికను అడిగాడు. అప్పటివరకు ఏమాత్రం తడబాటు లేకుండా టపీ టపీమని మాట్లాడుతున్న అమ్మాయి కాస్త పెళ్లి ప్రసక్తి రాగానే మెలికలు తిరిగిపోయింది. మొత్తానికి బిగ్ బాస్ లో సరికొత్త ప్రేమ కథకు శ్రీకారం మొదలయ్యింది.. ఇక రాను రాను వీళ్లిద్దరి మధ్య ఇంకెన్ని ట్విస్టులు వస్తాయో చూడాలి.