
ఆఫ్ స్క్రీన్ లో స్కిన్ షో చేయాలంటే డేర్ ఉండాలి. రష్మిక మందాన ఆ విషయంలో నేను తోపు అంటుంది. రష్మిక అరాకొరా బట్టలో పబ్లిక్ లోకి వచ్చి ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. బహుశా బాలీవుడ్ లో ఎదగాలన్న ఆశతోనేమో కానీ విచ్చలవిడిగా స్కిన్ షో చేస్తుంది. రష్మిక ధరించే బట్టలు ఆమెకు ఎంత సౌకర్యంగా ఉన్నాయో తెలియదు కానీ… చూసే వాళ్లకు ఇబ్బందిగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అర్ధ నగ్న సౌందర్యం.
తాజాగా కురచబట్టల్లో రష్మిక వార్తలకు ఎక్కింది. కోటు ధరించిన ఆమె బటన్స్ మాత్రం తీసేసింది. ఎద అందాలను చూపిస్తూ మనసులు వేడెక్కించింది. ఎక్కడో ఓ బటన్ ఆధారంగా నిలిచిన ఆమె ఇన్నర్ టాప్ మరింత టెన్షన్ పెట్టింది. ఆ బటన్ కూడా ఊడితే పరిస్థితి ఏంటని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

కాగా రష్మిక కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. నితిన్ కి జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో చిత్రం చేస్తున్నారు. ఉగాది కానుకగా దీనిపై అప్డేట్ ఇచ్చారు. ప్రాజెక్ట్ ప్రకటిస్తూ స్పెషల్ వీడియో విడుదల చేశారు. ఈ సినిమా రష్మికకు చాలా ప్రత్యేకం. వెంకీ కుడుముల ఆమెను టాలీవుడ్ కి తీసుకొచ్చిన దర్శకుడు. ఛలో, భీష్మ రెండు హిట్స్ ఆమెకు ఇచ్చాడు. నితిన్ తో రష్మికకు రెండో చిత్రం కాగా, వెంకీ కుడుములతో హ్యాట్రిక్. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.
ఆల్రెడీ రెండు బడా చిత్రాల షూటింగ్స్ లో రష్మిక పాల్గొంటున్నారు. హైదరాబాద్ లో పుష్ప 2 చిత్రీకరణ జరుగుతుంది. ఈ క్రేజీ సీక్వెల్ మీద దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 అంచనాలకు మించి ఉంటుందంటున్నారు. మూడు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. వెయ్యి కోట్ల టార్గెట్ తో అల్లు అర్జున్ బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. శ్రీవల్లిగా రష్మిక మరోసారి అలరించనుంది.

అలాగే బాలీవుడ్ చిత్రం యానిమల్ లో రష్మిక హీరోయిన్ గా చేస్తున్నారు. రన్బీర్ కపూర్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా యానిమల్ తెరకెక్కుతుంది. ఈ ఏడాది పుష్ప 2, యానిమల్ రెండూ థియేటర్స్ లో దిగే సూచనలు కలవు.