Site icon OkTelugu

Rashmika Mandanna: జూన్ లో ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి రష్మిక ప్లాన్ !

Rashmika Mandanna: ‘రష్మిక మందన్నా’ గత ఏడాది నుంచి వెకేషన్ కోసం చాలా ప్లాన్ చేసుకుంది. కానీ, ఇన్నాళ్లు ఆమెకు ఆ విశ్రాంతి సమయం దొరకలేదు. ప్రస్తుతం ఫ్రీ టైమ్ దొరికింది. రష్మిక తెలుగులో సైన్ చేసిన కొత్త చిత్రాలు మొదలు కావడానికి ఇంకా మూడు నెలలు టైముంది. కాకపోతే, ఈ గ్యాప్ లో ‘రష్మిక మందన్నా’ బాలీవుడ్ లో ఒప్పుకున్న ఒక పెద్ద చిత్రం పూర్తి చేయాలి.

Rashmika Mandanna

అలాగే, ‘రష్మిక’ తమిళంలో చేస్తున్న కొత్త సినిమా కోసం కూడా డేట్స్ కేటాయించాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె ఆ తమిళ సినిమా కోసం రిహార్సల్స్ చేస్తూ మీడియా కంట చిక్కింది. సూర్య హీరోగా రూపొందే కొత్త చిత్రంలో రష్మిక హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ వచ్చే వారమే ప్రారభం కాబోతుంది.

Also Read: Sobhan Babu- Balakrishna: ఒకే టైటిల్‌ తో వచ్చిన బాల‌య్య – శోభ‌న్‌బాబు.. ఎవరు హిట్టో తెలుసా?

సూర్య వంటి పెద్ద హీరో సరసన అవకాశం కావడంతో రష్మిక చాలా శ్రద్ధగా పని చేస్తోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కోసం రష్మిక 15 రోజులు డేట్లు ఇచ్చింది. అంటే.. వచ్చే నెలలో ఆమెకు ఏ సినిమా లేదు. అందుకే.. జూన్ లో ఫుల్ గా ఎంజాయ్ చేయాలని రష్మిక ఫిక్స్ అయిపోయింది. అందుకు తగ్గట్టు ప్లాన్ చేసుకుంటుంది.

Rashmika Mandanna

అన్నట్టు, ‘రష్మిక మందన్న’ తన గ్లామర్ కోసం ఎలాంటి బ్యూటీ టిప్స్ ఫాలో అవుతుందో తెలుసుకుందాం. ఉదయం లేవగానే ఒక గ్లాస్ నీళ్లతో రష్మిక డైలీ డైట్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మసాలా టీ, లేదా కాఫీ తాగుతుంది. బ్రేక్ ఫాస్ట్‌ లోకి ఇడ్లీ, దోసె లాంటి వాటితో పాటు రెండు ఎగ్స్ తింటుంది. లంచ్‌ కి మధ్యలో డ్రై ఫ్రూట్స్ తో పాటు కొబ్బరి నీళ్లు తాగుతుంది. మధ్యాహ్న భోజనంలోకి రష్మిక కచ్చితంగా బీట్‌రూట్, క్యారెట్, లేదా కీరా ఉండేలా చూసుకుంటుంది.

Also Read: Tamannaah Bhatia: వయసు పెరిగినా.. వేడి వేడి అందాలు వడ్డిస్తున్న తమన్నా

కొంచెం రైస్ లోకి పనీర్ తీసుకుంటుంది. తన శరీరానికి కావాల్సిన ప్రొటీన్స్ పనీర్, పప్పుల ద్వారానే అందుతాయని చెబుతుంది ఈ క్రేజీ బ్యూటీ. నైట్ భోజనంలో భాగంగా రష్మిక పప్పు, అన్నం, కూరగాయలు తింటుంది. సాయంత్రం ఏదైనా టోస్ట్ లేదా శాండ్ విచ్ తింటుంది. రోజంతా మధ్యమధ్యలో ప్రోటీన్ షేక్ తాగుతుంది. సాయంత్రం మాత్రం ఎర్ల్ గ్రే టీ తాగుతుంది.

Exit mobile version