హీరోయిన్ రష్మిక మందాన అరుదైన గౌరవం అందుకుంది. దీంతో ఆమె ప్రియుడు విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదిక స్పందించారు. ఆయన కామెంట్ వైరల్ అవుతుంది. రష్మిక మందాన టాప్ స్టార్స్ లో ఒకరు. నేషనల్ క్రష్ గా పేరుగాంచింది. ఆమె గత ఏడాది యానిమల్ మూవీ రూపంలో భారీ హిట్ కొట్టింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ బ్లాక్ బస్టర్ కొట్టింది. ఏకంగా రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రన్బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ మూవీలో రష్మిక మందాన బోల్డ్ సీన్స్ లో నటించింది.
లిప్ లాక్ సన్నివేశాల్లో మొహమాటం లేకుండా నటించింది. వరుస విజయాలతో జోరుమీదున్న రష్మిక మందానకు అరుదైన గౌరవం దక్కింది. ఫోర్స్బ్ ఇండియా 30 అండర్ 30 జాబితాలో ఆమెకు చోటు దక్కింది. దీంతో రష్మిక మందాన ప్రియుడు విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి…. అని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. ఇది వైరల్ అవుతుంది. రష్మిక మందాన, విజయ్ దేవరకొండ ఎఫైర్ లో ఉన్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ కథనాలను వారు పలుమార్లు ఖండించారు. వాళ్ళ మధ్య ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో జనాలు నమ్మడం లేదు. విజయ్ దేవరకొండ-రష్మిక ప్రేమికులే అంటున్నారు. ఇటీవల పెళ్లి వార్తలు కూడా వచ్చాయి. మరోవైపు రష్మిక చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప 2. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండగా అల్లు అర్జున్ హీరో. శ్రీవల్లిగా మరోసారి మెస్మరైజ్ చేయనుంది.
అలాగే కొన్ని లేడీ ఓరియెంట్ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. టాలీవుడ్ లో ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఛలో తో ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ హిట్ అందుకుంది. గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప చిత్ర విజయాలతో ఆమె స్టార్ డమ్ రాబట్టింది. ప్రస్తుతం అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో రష్మిక మందాన ఒకరు. కాగా కెరీర్ బిగినింగ్ లో రష్మిక కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించింది. ఎంగేజ్మెంట్ కూడా జరగ్గా, అనంతరం పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది.