Site icon OkTelugu

Pushpa 2: The Rule : పుష్ప 2 నుంచి సూపర్ అప్డేట్ ఇచ్చిన రష్మిక మందన

Rashmika Mandana gave a super update from Pushpa 2: The Rule

Rashmika Mandana gave a super update from Pushpa 2: The Rule

Pushpa 2: The Rule : పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫేమ్ పుష్ప 2 కోసం అభిమానులను ఎదురు చూసేలా చేస్తోంది. ఇక అదే రేంజ్ లో పుష్ప 2 నుంచి ఏ అప్డేట్ వచ్చినా సరే ఆదరిస్తున్నారు అభిమానులు. అందులో భాగంగానే పుష్ప 2 టైటిల్ సాంగ్ కూడా హిట్ అయింది. ఈ సాంగ్ కేక అనిపించుకుంది కూడా. ఈ ఒక్క పాటతో సినిమా మరో సారి హిట్ అంటూ టాక్ వచ్చేసింది. పుష్ప పుష్ప అంటూ సాగే ఈ పాటకి సోషల్ మీడియా మొత్తం షేక్ అయింది.

ఎక్కడ చూసినా పుష్ప 2 హుక్ స్టెప్‌ ఫీవర్ కనిపిస్తుంది. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ పుష్ప 2 సెకండ్ సింగిల్‌‌ గురించి ప్రకటించింది చిత్ర యూనిట్. ఇంకే అభిమానుల ఆనందం మరోసారి డబులు అయింది. అయితే రష్మిక మందన-అల్లు అర్జున్ మధ్య సాగే ఈ రొమాంటిక్ సాంగ్‌‌ను మే 29న ఉదయం 11.07 నిమిషాలకి రిలీజ్ చేయబోతున్నారట. ఈ విషయాన్ని రష్మికతో ప్రకటిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారుమేకర్స్.

ఈ సాంగ్ సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామీ అంటూ సాగుతుందట. ఇక ఈ పాటలో దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యూజిక్‌తో మాయ చేసేస్తాడు అంటూ టాక్ వస్తుంది. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న పుష్ప 2లో ఫహాద్ ఫాజిల్ విలన్ రోల్ లో నటిస్తున్నారు. మొదటి పార్ట్ లో కూడా ఆయన విలన్ పాత్రలో నటించారు. ఇందులో కూడా ఆయనే కంటిన్యూ అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవడానికి సిద్ధం అయింది.

విలన్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి. జూన్ 1న పుష్ప సెట్స్‌లోకి ఫహాద్ ఫాజిల్ రాబోతున్నారు అని టాక్. కంటిన్యూగా రెండు వారాల పాటు ఫహాద్ డేట్స్ ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. వీలైనంత త్వరగా ఈ పార్ట్ పూర్తి చేసి షూటింగ్‌కి శుభం కార్డు వేయబోతున్నారట చిత్ర యూనిట్. అయితే స్పెషల్ సాంగ్ షూటింగ్ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉంది. మరి ఇవన్నీ పూర్తి చేసుకొని ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు వస్తారో లేదో చూడాలి.

Exit mobile version