Rashmika Mandanna: రన్బీర్ తో లిప్ కిస్సులకు ఎక్స్ట్రా ఛార్జ్… రష్మిక ఎంత తీసుకుందంటే?

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాలో రొమాన్స్ డోస్ కూడా పరిమితికి మించి ఉంది.

Written By: Shiva, Updated On : October 15, 2023 1:14 pm

Rashmika Mandanna

Follow us on

Rashmika Mandanna: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది పాత సామెత. ఇది అన్ని కాలాలకు వర్తిస్తుంది. ఈ సూత్రం రష్మిక మందాన తూచా తప్పకుండా పాటిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. సినిమాకు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న రష్మిక ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారన్న న్యూస్ కాకరేపుతుంది. యానిమల్ మూవీలో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించినందుకు రెమ్యూనరేషన్ కి అదనంగా వసూలు చేసిందట.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాలో రొమాన్స్ డోస్ కూడా పరిమితికి మించి ఉంది. ఒక్క పాటతో సందీప్ రెడ్డి వంగా సినిమాకు ఎనలేని ప్రచారం తెచ్చాడు. అమ్మాయి అనే ఫస్ట్ సాంగ్ ఇటీవల విడుదల చేశారు. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీని దర్శకుడు ఘాటుగా చెప్పాడు.

పెదాలు జుర్రుకునే లిప్ లాక్ సీన్స్ మైండ్ బ్లాక్ చేశాయి. అర్జున్ రెడ్డి చిత్రానికి మించిన రొమాన్స్ యానిమల్ లో ఉంటుందని చెప్పకనే చెప్పాడు. అయితే ఈ సన్నివేశాల్లో రష్మిక మొహమాటం లేకుండా నటించింది. ఆమె అంతలా కోపరేట్ చేయడం వెనుక పెద్ద కారణమే ఉందట. లిప్ లాక్ సన్నివేశాలల్లో నటించేందుకు ఆమెకు ఎక్స్ట్రా ఛార్జ్ చేశారట. ఏకంగా రూ. 20 లక్షలు అదనంగా తీసుకుందట. నిర్మాత భూషణ్ కుమార్ ఆమె అడిగినంతా ఇచ్చేశాడట.

ఈ మేరకు ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. రష్మిక సినిమాకు రూ. 4 నుండి 5 కోట్లు తీసుకుంటుంది. ఇక ఏ దర్శకుడైనా ఆమెపై లిప్ లాక్ సన్నివేశాలు చిత్రీకరించాలి అంటుకునే ఇరవై లక్షలు చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలి. అదన్న మేటర్. నేను చేయను, నా వల్ల కాదు అని దర్శక నిర్మాతలను ఇబ్బంది పెట్టడం కంటే రష్మిక మాదిరి కావాల్సినంత అడిగి తీసుకోవడం బెటర్ అంటున్నారు. ఇక యానిమల్ డిసెంబర్ 1న విడుదల కానుంది. బాబీ డియోల్ విలన్ రోల్ చేశారు.