Ram Charan: అభిమానులకు దసరా కానుక ఇచ్చిన రామ్ చరణ్… న్యూ మూవీ అప్డేట్ ?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో… ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ అనే మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అయితే ఇటీవల తమిళ స్టార్ డైరెక్టర్ […]

Written By: Raghava Rao Gara, Updated On : October 15, 2021 10:58 am
Follow us on

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో… ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆర్ఆర్ అనే మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అయితే ఇటీవల తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నట్లు చరణ్ ప్రకటించాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

అయితే ఇప్పుడు తాజాగా దసరా కానుకగా అభిమానులకు ఓ స్వీట్ న్యూస్ చెప్పాడు రామ్ చరణ్. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయబోతున్నట్లుగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు చెర్రీ. కాగా ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, ఎన్వీఆర్ సినిమా బ్యానర్లలో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నేపధ్యంలో చరణ్ కు సంబంధించిన పోస్టర్ ను చిత్రా బృందం రిలీజ్ చేసింది. జెర్సీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు గౌతమ్. షాహిద్ కపూర్ హీరోగా హిందీలో జెర్సీ చిత్రాన్ని గౌతమ్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

కాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో… చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 సినిమాను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.