Rakul Preet Singh Car: లగ్జరీ బెంజ్ సొంతం చేసుకున్న రకుల్ ప్రీత్… ఎన్ని కోట్లే తెలిస్తే మైండ్ బ్లాక్!

తాజాగా ఈ భామ మెర్సిడెజ్ బెంజ్ కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కొనుగోలు చేసిన కారు ముందు నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చింది రకుల్.

Written By: Shiva, Updated On : September 9, 2023 11:50 am

Rakul Preet Singh Car

Follow us on

Rakul Preet Singh Car: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని బాలీవుడ్ లో తన హవా కొనసాగుతున్న నటి రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో కెరటం అనే సినిమాతో హీరోయిన్ గా రంగప్రవేశం చేసిన రకుల్ వేంకటాద్రి ఎక్సప్రెస్ , నాన్నకు ప్రేమతో , సరైనోడు , ధృవ వంటి సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించిన మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సత్తా చాటుతుంది.

ఈ ఏడాది బూ అనే సినిమాతో OTT లో అలరించిన ఈ భామ, గత ఏడాది దాదాపు అరడజన్ చిత్రాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. ‘అటాక్ ‘,’రన్ వే 34’ , ‘కట్ పుట్లీ ‘,’డాక్టర్ జి ‘, ‘థాంక్ గాడ్ ‘ , ‘ఛత్రవాలి ‘ లాంటి బాలీవుడ్ సినిమాలతో ముందుకు వచ్చింది. దీంతో బీ టౌన్ ఏరియా లో రకుల్ ప్రీత్ సింగ్ పేరు మార్మోగుతుంది. అదే సమయంలో అటు రెమ్యూనరేషన్ పరంగా కూడా మంచి స్థాయిలో అందుకుంటుంది ఈ భామ.

ఇక తాజాగా ఈ భామ మెర్సిడెజ్ బెంజ్ కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కొనుగోలు చేసిన కారు ముందు నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చింది రకుల్. ఈ లగ్జరీ బెంజ్ మేబ్యాచ్ జిఎస్ఎల్ కారు దాదాపు మూడు కోట్లు ఖరీదైన ఈ కారును సొంతం చేసుకున్న రకుల్, అక్కడ వున్నా వాళ్లందరికీ స్వీట్స్ ఇచ్చి తన ఆనందాన్ని పంచుకుంది.

ప్రస్తుతం అటు బాలీవుడ్ లోనూ ఇటు కోలివుడ్ లో సమాంతరంగా నటిస్తుంది ఈ 32 ఏళ్ల ముద్దుగుమ్మ. హిందీ లో ‘ఐ లవ్ యు’ , అలాగే మేరీ పత్ని కా రీమేక్ సినిమాలో నటిస్తుంది. ,మరోపక్క తమిళ్ లో శంకర్ , కమలహాసన్ కాంబినేషన్ లో వస్తున్న ఇండియన్ 2 లో అలాగే అయలన్ అనే మరో సినిమాలో నటిస్తుంది. ఇక తెలుగులో విషయానికి వస్తే 2021 లో వచ్చిన కొండపొలం సినిమా తర్వాత మరొక సినిమాలో నటించలేదు.