రకుల్ సీరియస్.. హరీష్ శంకర్ ఓదార్పు !

అందాల భామ రకుల్‌ ప్రీత్ సింగ్‌ కి కాస్త కోపం ఎక్కువ. సక్సెస్ లో ఉంది కాబట్టి, ఆమె కోపాన్ని కూడా ప్రేమగా భావించాల్సిన పరిస్థితిలో ఉన్నారు మేకర్స్. అయితే తాజాగా రకుల్ క్లిక్స్ కోసం ఎలాంటి హెడ్డింగ్‌లైనా పెట్టేస్తారా? అంటూ మీడియా పై సీరియస్ అయింది. ఓ ఆంగ్ల పత్రికలో తన గురించి వచ్చిన కథనం పై రకుల్ ‘హీరోయిన్స్ అంటే చులకన భావం ఎప్పుడు పోతుందో. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే.. […]

Written By: admin, Updated On : June 21, 2021 2:50 pm
Follow us on

అందాల భామ రకుల్‌ ప్రీత్ సింగ్‌ కి కాస్త కోపం ఎక్కువ. సక్సెస్ లో ఉంది కాబట్టి, ఆమె కోపాన్ని కూడా ప్రేమగా భావించాల్సిన పరిస్థితిలో ఉన్నారు మేకర్స్. అయితే తాజాగా రకుల్ క్లిక్స్ కోసం ఎలాంటి హెడ్డింగ్‌లైనా పెట్టేస్తారా? అంటూ మీడియా పై సీరియస్ అయింది. ఓ ఆంగ్ల పత్రికలో తన గురించి వచ్చిన కథనం పై రకుల్ ‘హీరోయిన్స్ అంటే చులకన భావం ఎప్పుడు పోతుందో. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే.. టాలీవుడ్‌లో నాకు అవకాశాలు రావడం లేదని నేను ఎప్పుడు చెప్పాను ?

మరి నాకు తెలుగు ఇండస్ట్రీలో ఛాన్స్ లు లేవు అని వీళ్లు హెడ్డింగ్‌ లు ఎలా పెడతారు ? ఒక ఏడాది 365 రోజులే ఉంటాయి. ఇప్పుడు నేను ప్రస్తుతం ఆరు సినిమాలు చేస్తున్నాను. కొత్త ఆఫర్స్‌ వచ్చినా.. నా డేట్స్‌ సర్దుబాటు చేయలేని పరిస్థితి నాది. ఒకవేళ మీరు నా డేట్లు పెంచగలిగితే మా టీమ్‌కి సాయం చేయండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు రాస్తే సహించేది లేదు’ అంటూ రకుల్ రెచ్చిపోయి ట్వీట్ చేసింది.

ఇక రకుల్‌ ట్వీట్‌ పై స్పందించాడు దర్శకుడు హరీశ్‌ శంకర్‌. ఎప్పుడు ఏ అంశం పై రియాక్ట్ అవుదామా అంటూ ఎదురుచూస్తూ ఉంటాడు హరీష్ శంకర్. రకుల్ ట్వీట్ పై పోస్ట్ పెడుతూ ‘నాకు తెలుసు రకుల్‌.. షూటింగ్స్‌ తో నువ్వు ఎంత బిజీగా ఉన్నావో. నా ఫ్రెండ్ రాసిన స్క్రిప్ట్‌ నీకు నచ్చినా.. నీ డేట్స్‌ లేక ఆ సినిమా పోస్ట్ ఫోన్ అయింది. నువ్వు ఇలాగే నీ సినిమాలతో అందరికీ సమాధానం చెప్పు రకుల్’ అంటూ పెద్ద మనిషి తరహా ట్వీట్ పెట్టాడు హరీష్ బాబు.

అన్నట్టు రకుల్ రెమ్యున‌రేష‌న్ తగ్గించుకుంది. సహజంగా ఆమె తీసుకునే దానిలో సగమే ఇప్పుడు ఆమెకు ఇస్తున్నారు. ఇంకా త‌గ్గించుకోవాల‌ని రకుల్ ను కోరుతున్నారు నిర్మాతలు. అందుకే రకుల్ కొన్ని సినిమాలు నుండి తప్పుకుంటుంది. ఈ నేప‌థ్యంలో స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ర‌కుల్ కి నిజంగానే ఈ మధ్య ఆఫర్స్ తగ్గాయి.