Rajinikanth: స్క్రీన్ పైనే కాదు.. నిజజీవితంలో కూడా రజనీకాంత్ సూపర్ స్టార్ అంటుంటారు ఆయన అభిమానులు. ప్రస్తుతం అలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.
ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ సినిమా సక్సెస్ను ఆయన అభిమానులు ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
రజనీకాంత్ పని అయిపోయింది సినిమాలకు గుడ్ బై చెప్పవచ్చు అనుకుంటున్న సమయంలో జైలర్ సినిమా తో ప్రేక్షకులను పలకరించడంతో పాటు బాక్సాఫీస్ ని షేక్ చేశారు. 70 ఏళ్ల వయసులో కూడా దాదాపు 600 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించి సూపర్ స్టార్ అనిపించుకున్నారు.
కాగా రజని సూపర్ స్టార్ కాకముందు ఎన్నో వ్యసనాలకు అలవాటు పడ్డారు.సిగరెట్లు తాగటం, మందు అమ్మాయిలు ఇలా విచ్చలవిడిగా జలసాలు చేసేవారట. కానీ ఆయన లతన్ని ప్రేమించే పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి రాఘవేంద్ర స్వామి భక్తుడిగా మారిపోయారని అలానే అలవాట్లు అన్నీ మార్చుకున్నారని అంతేగాక పూర్తిగా ఆధ్యాత్మిక బాట పట్టేశారు అని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత రజినీకాంత్ ఎంతోమందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇక అప్పటినుంచి రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా సూపర్ స్టార్ అనిపించుకుంటూ వచ్చారు. ఇక అప్పుడు రజిని చేసిన ఒక సహాయం ఎప్పుడు వెలుగులోకి వచ్చింది. అదేమిటి అంటే అప్పట్లో తమిళనాడును ఒక ఊపు ఊపేసిన ఒక స్టార్ హీరోయిన్ ఆర్థికంగా చిదిగిపోయి ఎన్నో ఇబ్బందులు పడుతోందిగ..ఆమె సాయం కోసం రజని కి తన బాధలన్నీ చెప్పిందట.
తన కష్టాలు తెలుసుకోగానే రజినీకాంత్ నాలుగు నోట్ల కట్టలు తీసి ఇచ్చి నీకు ఏ సాయం కావాలన్నా నేను ఉన్నాను నాకు చేతనైనంత సాయం చేస్తాను.ఎలాంటి మొహమాటం లేకుండా రమ్మని చెప్పి పంపారట. ఆ హీరోయిన్ శివాజీ గణేషన్ కమల్ హాసన్ సన్ లాంటి స్టార్ హీరోలతో కూడా నటించింది అంట.
ఇక ఈ పాత వార్త ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.