Site icon OkTelugu

Radhe Shyam vs Pushpa vs Bheemla Nayak: రాధేశ్యామ్ వర్సెస్ పుష్ప వర్సెస్ భీమ్లానాయక్

Radhe Shyam vs Pushpa vs Bheemla Nayak: ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాల నుంచి యూఎస్ఏ వరకు భారీ వసూళ్లను నమోదు చేస్తోంది. ప్రభాస్ సినిమా సక్సెస్‌తో ‘రాధేశ్యామ్’ వేడుకులు చేసుకుంటుంది. మరోపక్క టీం స్పెషల్ ట్రీట్ ఇచ్చి మరీ తమ ఆనందాన్ని పంచుకుంటుంది.

Radhe Shyam vs Pushpa vs Bheemla Nayak

అయితే, ‘రాధేశ్యామ్’ వర్సెస్ ‘భీమ్లా నాయక్’ కలెక్షన్స్ విషయానికి వస్తే.. భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము లేపే కలెక్షన్స్ తో దంచికొట్టింది.

సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆంధ్ర లో లో టికెట్ రేట్ల కారణంగా దెబ్బ పడినా నైజాంలో రికార్డ్ కలెక్షన్స్ తో రచ్చ చేసాయి ‘భీమ్లా నాయక్’, పుష్ప చిత్రాలు. కానీ ‘భీమ్లా నాయక్’, ‘పుష్ప’ సినిమాల కలెక్షన్స్ కంటే.. ‘రాధేశ్యామ్’కి ఎక్కువ కలెక్షన్స్ రావడం విశేషం. రెండు రాష్ట్రాల్లో పుష్ప రూ. 16.70 కోట్ల షేర్ రాబడితే, ‘భీమ్లా నాయక్’ రూ. 19.80 కోట్ల షేర్ రాబట్టింది.

కానీ ‘రాధేశ్యామ్’ రూ. 23.14 కోట్లు వసూలు చేశాడు. ఓవరాల్ గా పుష్ప మొదటి రోజు సినిమా 22 కోట్ల నుండి 24 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా… ‘భీమ్లా నాయక్’ మొదటి రోజు సినిమా 26 కోట్ల నుండి 27 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.

Radhe Shyam

ఇక ‘రాధేశ్యామ్’ విషయానికి వస్తే.. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 46 కోట్ల నుండి 47 కోట్ల రేంజ్ షేర్ అందుకోనుంది. మొత్తమ్మీద ‘పుష్ప’, ‘భీమ్లా నాయక్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధిస్తే.. ‘రాధేశ్యామ్’ అంతకన్నా గొప్ప విజయాన్ని సాధించాయి.

Exit mobile version