Radhe Shyam Trailer 2 Review: ‘రాధేశ్యామ్’ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. దాంతో సినిమాలో అదనపు హంగులు కోరుకుంటారనే.. మేకర్స్ ఈ సినిమాని అన్ని ఎమోషన్స్ తో నింపేశారు. తాజాగా ఈ సినిమా ‘ట్రైలర్ 2’ రిలీజ్ అయింది. ‘మనం ఆలోచిస్తున్నాం అని భ్రమపడుతుంటాం.. కానీ మన ఆలోచనలు కూడా ముందే రాసి ఉంటాయ్’ అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.

అలాగే, ‘ప్రేమ విషయంలో ఆదిత్య ప్రెడిక్షన్ తప్పు’ అంటూ పూజా హెగ్డే ఎమోషనల్ టోన్ తో చెప్పే డైలాగ్ కూడా బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ట్రైలర్ లో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ లు ఒకదానికి ఒకటి పోటీ పడ్డాయి. పైగా ప్రభాస్ చాలా స్టైలిష్ లుక్ లో ఎంట్రీ ఇచ్చాడు. టాల్ బ్యూటీ పూజా హెగ్డే ఎంట్రీ కూడా చాలా బాగుంది. ఇక పూజా హెగ్డే పై ప్రేమను కురిపిస్తూ ఆమెను ప్రేమలో పడేసే షాట్స్ లో ప్రభాస్ చాలా యంగ్ గా కనిపించాడు.
Also Read: చిరంజీవి, మోహన్ బాబులో ఎవరు గొప్పవారో ఆనాడే చెప్పిన దాసరి.. ఏమన్నారంటే..?
మొత్తమ్మీద అదనపు హంగులతో పాటు అలరించే డైలాగ్ లతో ఈ ట్రైలర్ చాలా బాగా ముస్తాబు అయ్యింది. ప్రభాస్ పాత్ర విషయానికి వస్తే.. గొప్ప హస్తసాముద్రిక నిపుణుడు విక్రమాదిత్యగా ప్రభాస్ పూర్తిగా కొత్త పాత్రలో కనిపించాడు. పుట్టుక నుంచి చావు దాకా.. ఏ రోజు ఏమి జరుగుతుందో చెప్పగలిగే పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయాడు. మరి ప్రపంచం మొత్తాన్ని చదివేసే హీరో.. హీరోయిన్ని ఎంతవరకు చదవ గలడో అనే కోణంలో సాగే ప్రేమ కథ కూడా ఆసక్తిగా ఉంది.
కాలం రాసిన చందమామ కథలా సాగే ఈ ప్రేమకథలో.. హీరో ప్రేమ పొందడం వరం, దాన్ని అందుకోవడం మాత్రం యుద్ధం అనే కోణంలో ముగిసే ఈ సినిమా మరి ఎలా ఉంటుందో చూడాలి. ప్రభాస్ – పూజా హెగ్డే ప్రేమకథలో జ్యోతిష్యం కీలక పాత్ర పోషించబోతుంది. అయితే, ఈ ట్రైలర్ లో ఏదో పెద్ద ప్రమాదం జరగబోతుందనే సెన్స్ తో కొన్ని షాట్స్ ను చాలా ఎఫెక్టివ్ గా కట్ చేసారు.
త్తమ్మీద ‘రాధే శ్యామ్’ సినిమాలో ప్రభాస్ – పూజ హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. ప్రభాస్ లుక్స్ చాలా కొత్తగా ఉన్నాయి. పూజా కూడా చాలా అందంగా కనిపించింది. ఇక పరమహంస పాత్రలో కృష్ణంరాజు మెరిసారు. ఏది ఏమైనా ‘రాధే శ్యామ్’ ట్రైలర్ 2 లోని విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. కాగా కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ – టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Also Read: వైరల్ అవుతున్న టుడే మూవీ అప్ డేట్స్
[…] Bigg Boss OTT Telugu: తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులారిటీ సంపాదించిన బిగ్ బాస్ షోను OTTలో లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి డిస్నీ హాట్ స్టార్ భారీగా ప్లాన్ చేసింది. ‘నో కామా.. నో ఫుల్ స్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్’ అంటూ బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున దీనిని ప్రారంభించాడు. 24గంటల పాలు లైవ్ స్ట్రీమింగ్ ఇస్తే.. బాగా కాసులు కురుస్తాయని బిగ్ బాస్ ప్రొడ్యూసర్లు వేసిన అంచనాలు తప్పినట్లు కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ కోసం చాలామంది హాట్ స్టార్ మెంబర్ షిప్ తీసుకుంటారని అనుకుంటే, అంచనాలు తలకిందులైనట్లు కనిపిస్తోంది. […]