Site icon OkTelugu

Pushpa 2: పుష్ప 2 టార్గెట్ 1000 కోట్లు కాదట.. అల్లు అర్జున్ లెక్క వేరేలా ఉందిగా.?

Pushpa 2 target is not 1000 crores

Pushpa 2 target is not 1000 crores

Pushpa 2: ప్రస్తుతం ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్..గంగోత్రి సినిమా నుంచి ఇప్పటి వరకు ఆయన మంచి సినిమాలు చేస్తూ టాప్ రేంజ్ లో దూసుకుపోతున్నాడనే చెప్పాలి. పాన్ ఇండియా లో తన సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు అనే విషయం అయితే మనకు తెలిసిందే…ఎందుకంటే ఈ సినిమా మీద వాళ్లు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా ఎలాగైనా సరే 1000 కోట్ల వరకు కలెక్షన్స్ ను వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ మాత్రం 1000 కోట్లు కాదు అంతకుమించి అంటున్నాడు.ఈ సినిమా దాదాపు 1500 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుంది. అంటూ తను తన నిర్ణయాన్ని తెలియజేస్తున్నాడు.

ఇక మొత్తానికైతే పుష్ప 2 సినిమా మీద అల్లు అర్జున్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. 1500 కోట్లు అంటే మాటలు కాదు ఒకవేళ అంత కలెక్ట్ చేసినట్లయితే అల్లు అర్జున్ టాప్ రేంజ్ లోకి వెళ్ళిపోతాడనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆయన ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక అందులో భాగంగానే విపరీతంగా కష్టపడుతూ సినిమాలు చేస్తూ ఉంటాడు. తన కష్టమే తనను కాపాడుతూ వస్తుందనేది మాత్రం వాస్తవం.

అందుకే ఆయన అప్పుడు ఈ రేంజ్ లో భారీ సక్సెస్ సాధించాడు. ఇక నిజానికి “నేషనల్ అవార్డు” గెలుచుకునే స్థాయికి వెళ్ళాడు అంటే ఆయన ఎంత మంచి నటుడో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక పుష్ప 2 సినిమాతో అంతకుమించి అనేలా వసూళ్లు రాబట్టి తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు…ఐతే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ సినిమాను టచ్ చేసే మరొక సినిమా లేదు అనేది మాత్రం వాస్తవం…

Exit mobile version