Star Heroine: కడుపులో బిడ్డ ఉన్న కూడా షూటింగ్ లో పాల్గొని సినిమా మీద ఇష్టాన్ని చాటుకున్న స్టార్ హీరోయిన్…

ఒక హీరోయిన్ కూడా సినిమా మీద తన ఇష్టాన్ని చాటుకుంది. ఎంతలా అంటే తన కడుపులో బిడ్డ ఉన్నా కూడా రెస్ట్ తీసుకోవాల్సిన సమయం అని తెలిసిన కూడా సినిమా షూటింగ్ చేసి సినిమా అనేది ప్యాషన్ కాదు తన ప్రాణం అని ప్రూవ్ చేసింది.

Written By: Neelambaram, Updated On : April 19, 2024 1:12 pm

Deepika Padukone at Singham Again Shooting

Follow us on

Star Heroine: సినిమా అంటే చాలామందికి విపరీతమైన ఇష్టం ఉంటుంది. ఇక మరికొందరికి మాత్రం ఇదే ప్రాణం అని పెట్టుకుని బతికేస్తుంటారు. వాళ్ళు సినిమా కోసం ఎలాంటి క్యారెక్టర్ నైనా చేస్తారు. ఎలాంటి ఇబ్బందిని అయిన ఎదుర్కొంటారు. ఎందుకంటే వాళ్లకి సినిమానే ప్రాణం.. ఇక మొత్తానికైతే సినిమా కోసం డెడికేషన్ తో వర్క్ చేసే నటినటులు కొంత మంది మాత్రమే ఉన్నారు. అందులో ముఖ్యంగా విక్రమ్ లాంటి హీరో అయితే ‘ ఐ’ సినిమా కోసం ఏకంగా 20 కేజీల వరకు బరువును తగ్గి చాలా వీక్ గా అయిపోయి ఆ సినిమా కోసం ప్రాణాన్ని సైతం పణం గా పెట్టి చేశాడు. ఇక అలాగే ఆ సినిమాలో తన క్యారెక్టర్ లో 3 వేరియేషన్స్ చూపిస్తూ విపరీతంగా కష్టపడ్డాడు.

ఇక రిజల్ట్ ఎలా ఉన్నా ఆయన డెడికేషన్ కి మాత్రం విమర్శకుల నుంచి ప్రశంసలైతే దక్కాయి. ఇక ఇప్పుడు ఒక హీరోయిన్ కూడా సినిమా మీద తన ఇష్టాన్ని చాటుకుంది. ఎంతలా అంటే తన కడుపులో బిడ్డ ఉన్నా కూడా రెస్ట్ తీసుకోవాల్సిన సమయం అని తెలిసిన కూడా సినిమా షూటింగ్ చేసి సినిమా అనేది ప్యాషన్ కాదు తన ప్రాణం అని ప్రూవ్ చేసింది. ఆ అమ్మడు ఎవరు అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…

‘ఓం శాంతి ఓం’ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ‘దీపికా పదుకొనే’ ఆ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ఇక అప్పటినుంచి వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక తను హీరో రన్వీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక రీసెంట్ గా రన్వీర్ సింగ్, దీపికా పదుకొనే ఇద్దరు కలిసి వాళ్ళు పేరెంట్స్ అవ్వబోతున్నారనే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక ఇది ఇలా ఉంటే దీపికా పదుకొనే సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇంట్లో బేబి బంప్స్ తో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తుందని అందరు అనుకున్నారు.

కానీ కట్ చేస్తే ఆమె సినిమా షూటింగ్ లో పాల్గొన్న ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలోకి వస్తే ‘సింగం అగైన్’ అనే సినిమాలో తను ఒక కీలకపాత్రలో నటిస్తుంది. ఇక ఈ సినిమాలో అజయ్ దేవగన్, రన్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, కరీనాకపూర్ లాంటి దిగ్గజ నటినటులు నటిస్తున్నారు. ఇక దీపిక ప్రెగ్నెంట్ అయినప్పటికీ తన వల్ల ప్రొడ్యూసర్స్ కి నష్టం రాకూడదనే ఉద్దేశ్యం తోనే దీపిక పదుకునే ఈ సినిమా షూటింగ్స్ లో పాల్గొని అందరికీ షాక్ ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది ఆమెకి సినిమా అంటే ప్రాణం అంటుంటే, మరి కొంతమంది మాత్రం ఇలాంటి సమయంలో ఇంత పెద్ద రిస్క్ చేయడం అవసరమా అని కూడా విమర్శిస్తున్నారు. ఇక ఎవరు ఏమనుకున్నా ఈ అమ్మడు మాత్రం ఒక పెద్ద రిస్క్ చేసిందనే చెప్పాలి…