https://oktelugu.com/

Prabhas :  ప్రభాస్  ‘సలార్’లో  విజయ్ దేవరకొండ హీరోయిన్ !       

 Prabhas’s Salaar : పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కి  బాలీవుడ్ యంగ్ బ్యూటీ  విజయ్ దేవరకొండ హీరోయిన్ ‘అనన్య పాండే’  ప్రేయసిగా నటించబోతుంది.   హై వోల్టేజ్ యాక్షన్  డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో  ప్రభాస్ హీరోగా  రానున్న  ‘సలార్’ సినిమాలో ప్రభాస్ తో  కొన్ని కీలక సన్నివేశాల్లో  అనన్య పాండే  నటిస్తోందట.  ఆమె ఓ ఉన్నతాధికారి పాత్రలో కనిపించబోతుందని.. తన అవసరం రీత్యా ఆమెతో ఎఫైర్ పెట్టుకుని  తను అనుకున్నది ప్రభాస్ సాధిస్తాడని తెలుస్తోంది. సినిమాలో ఈ ట్రాక్ నాలుగు సీన్స్ లో ముగుస్తోందట.  ఇక ‘సలార్‌’  […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 23, 2022 / 08:37 PM IST
    Follow us on

     Prabhas’s Salaar : పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ కి  బాలీవుడ్ యంగ్ బ్యూటీ  విజయ్ దేవరకొండ హీరోయిన్ ‘అనన్య పాండే’  ప్రేయసిగా నటించబోతుంది.   హై వోల్టేజ్ యాక్షన్  డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో  ప్రభాస్ హీరోగా  రానున్న  ‘సలార్’ సినిమాలో ప్రభాస్ తో  కొన్ని కీలక సన్నివేశాల్లో  అనన్య పాండే  నటిస్తోందట.  ఆమె ఓ ఉన్నతాధికారి పాత్రలో కనిపించబోతుందని.. తన అవసరం రీత్యా ఆమెతో ఎఫైర్ పెట్టుకుని  తను అనుకున్నది ప్రభాస్ సాధిస్తాడని తెలుస్తోంది. సినిమాలో ఈ ట్రాక్ నాలుగు సీన్స్ లో ముగుస్తోందట.  ఇక ‘సలార్‌’  కొత్త  షెడ్యూల్‌ లో  అనన్య పాండే  పార్ట్ తీయబోతున్నారు.  

    మొత్తానికి అనన్య పాండే   కెరీర్  ఈ సినిమాతో టర్న్ అయినట్టే.  ఇప్పుడిప్పుడే తెలుగులో లైమ్‌ లైట్‌ లోకి రావడానికి తెగ ప్రయత్నాలు చేస్తోన్న  అనన్య పాండేకి,   ఇది  గోల్డన్ ఛాన్స్ లాంటిదే.   ఇప్పటికే  అనన్య పాండే  ‘లైగర్’  సినిమాలో నటించింది.  దాదాపు   షూటింగ్ పూర్తి చేసుకున్న లైగర్  సినిమాలో  ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.  అలాగే  అనన్య పాండే   ప్రస్తుతం  రెండు హిందీ  సినిమాలు కూడా  చేస్తోంది. 

    ఇప్పుడు ఆమె ఖాతాలో  ‘సలార్‌’  కూడా చేరింది.  మొత్తానికి ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్  ఎప్పుడొస్తుందా? అంటూ  ఆశగా చూసిన అభిమానులకు  ఈ న్యూస్ మంచి కిక్కిచ్చే వార్తే.   ఇక  ‘సలార్‌’లో ప్రభాస్‌ సరసన శ్రుతిహాసన్‌ సందడి చేయనుంది.  ఈ క్రేజీ యాక్షన్ ఫిల్మ్ పై   భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను క్యాష్ చేసుకోవాలని సలార్ నిర్మాతలు  స‌లార్ ని  రెండు భాగాలుగా రిలీజ్  చేయాలనే  ఆలోచ‌నలో ఉన్నారు.  

    ఒకవేళ  రెండు పార్ట్స్ గా తీసుకువస్తే    బాక్సాఫీస్ వద్ద  నిర్మాతలకు భారీ లాభాలు వస్తాయి. పైగా   రాజమౌళి తర్వాత  ఆ స్థాయి మార్కెట్ ఉన్న డైరెక్టర్  ప్ర‌శాంత్ నీల్.  కేజీఎఫ్ తో  ప్రశాంత్ నీల్  కూడా  పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు.  మరి రెండు పార్ట్స్ గా ఈ సినిమా వస్తోందా ?  రాదా ?  చూడాలి.  ఈ చిత్రాన్ని  భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిలిమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది.