Site icon OkTelugu

Deepika Padukone: పాడైన దీపికా మెంటల్ కండీషన్… అయోమయంలో రూ. 500 కోట్ల ప్రభాస్ మూవీ!

Deepika Padukone: ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్ కే’ అనుకోని చిక్కుల్లో పడింది. ఈ మూవీ షూటింగ్ అర్థాంతరంగా నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి. దానికి హీరోయిన్ దీపికా పదుకొనెనే కారణం అంటున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ భారీ ఎత్తున ప్రాజెక్ట్ కే ప్లాన్ చేశారు. స్వయంగా ఇది పాన్ వరల్డ్ మూవీ అంటూ ప్రకటించారు. ఇక సినిమా స్కేల్ పెద్దది కావడంతో క్యాస్టింగ్ సైతం అదే స్థాయిలో ఎంచుకున్నారు. హీరోయిన్ గా దీపికా పదుకొనెని తీసుకోవడం జరిగింది. ఈ మూవీ కోసం ఆమెకు రికార్డు రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. అయితే ఆమె కారణంగానే మూవీ ఇబ్బందుల్లో పడ్డట్లు తెలుస్తుంది.

Deepika Padukone, prabhas

దీపికాకు మానసిక సమస్యలు ఉన్నాయి. హీరో రన్బీర్ కపూర్ తో బ్రేకప్ తర్వాత ఆమె డిప్రెషన్ లోకి జారుకున్నారు. ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. వైద్యుల సహాయంతో దీపిక డిప్రెషన్ నుండి బయటపడ్డారు. రణ్వీర్ సింగ్ తో వివాహం తర్వాత కూడా ఆమె మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీని కోసం క్రమం తప్పకుండా మందులు వాడుతున్నారు.నిపుణుల వద్ద చికిత్స తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఆమె ప్రాజెక్ట్ కె సెట్స్ లో పానిక్ అటాక్ కి గురయ్యారట. దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారట.

Also Read: RRR: ఆర్ఆర్ఆర్ ఇంటర్వెల్ ఫైట్ అదిరిపోయేలా ఇలా తీశారు!

ఇక షూటింగ్స్ సెట్స్ లో కూడా ఆమె చురుకుగా ఉండటం లేదట. ఆలస్యంగా రావడం చేస్తున్నారట. దీపికా ఆరోగ్య సమస్యలు ప్రభాస్ కి తలనొప్పిగా మారాయట. ఆమె కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో దీపికా పూర్తిగా కోలుకున్నాకే షూటింగ్ చేద్దాం, ప్రస్తుతానికి ఆపండి అని ఆదేశించారట. ప్రభాస్ నిర్ణయంతో ప్రాజెక్ట్ కె షూటింగ్ ఆగిపోయింది అంటున్నారు. దీర్ఘకాలిక సమస్యతో బాధపడుతున్న దీపికా ఎప్పుడు తిరిగి కోలుకుంటారనే సందిగ్ధత కొనసాగుతుంది. రూ. 500 కోట్ల ప్రాజెక్ట్ భవిష్యత్ అయోమయంగా మారింది.

Deepika Padukone, prabhas

ఇటీవల కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న దీపికా చాలా ఉత్సాహంగా కనిపించారు. ఖరీదైన డిజైనర్ వేర్స్ లో రెడ్ కార్పెట్ పై హొయలు పోయారు. సడన్ గా ఆమె మానసిక స్థితి గతి తప్పడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ప్రభాస్ ఒప్పుకున్న చిత్రాలు త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నారు. ఆయన నటించిన ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. సలార్ షూటింగ్ జరుపుకుంటుంది.

Also Read:Telugu Indian Idol: చిరంజీవికే ఆటోగ్రాఫ్ ఇచ్చిన యువ సింగర్ ఎవరో తెలుసా!

Exit mobile version