Prabhas Radhe Shyam Movie Box Office Collection: ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ ను ఓ ఊపు ఊపేస్తోంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకోవడానికి బాగుంది గానీ, వాస్తవానికి వాస్తవిక పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా.. ఈ సినిమా పర్ఫెక్ట్ లవ్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ ఈ సినిమాని బతికించడానికి తమ భుజానికెత్తుకున్నారు ప్రభాస్ అభిమానులు. కానీ, లెక్కల వ్యవహారంలో భారీ వసూళ్లను కొల్లగొట్టడంలో ‘రాధేశ్యామ్’ అడ్డంగా దొరికిపోయాడు.
విడుదలైన అన్ని చోట్ల నేటితో కలెక్షన్స్ సగానికి పడిపోయాయి. ‘రాధేశ్యామ్’ ఫస్ట్ టు డేస్ కలెక్షన్స్ కు.. ఆ తర్వాత మూడో రోజు కలెక్షన్స్ కు చాలా వ్యత్యాసం కనిపించింది. ఇక నాలుగో రోజు వచ్చే సరికి కలెక్షన్స్ దారుణాతి దారుణంగా వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం భారీ స్థాయిలో 7000 స్క్రీన్ లలో విడుదల అయినప్పటికీ.. గట్టిగా వంద కోట్లు కూడా కలెక్ట్ చేయలేక చతికిలపడింది. ఏరియాల వారీగా కలెక్షన్స్ చూస్తే..
Also Read: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ అప్ డేట్స్
ఏపీ & తెలంగాణలో ‘రాధేశ్యామ్’ నాలుగో రోజు కలెక్షన్స్ :
నైజాం 22.87 కోట్లు
సీడెడ్ 06.92 కోట్లు
ఉత్తరాంధ్ర 04.69 కోట్లు
ఈస్ట్ 04.02 కోట్లు
వెస్ట్ 03.11 కోట్లు
గుంటూరు 04.19 కోట్లు
కృష్ణా 02.43 కోట్లు
నెల్లూరు 02.00 కోట్లు
ఏపీ మరియు తెలంగాణలో నిన్న వచ్చిన కలెక్షన్స్ మొత్తం కలుపుకుని చూస్తే : 50.23 కోట్లు
తమిళ నాడు 0.68 కోట్లు
కేరళ 0.29 కోట్లు
కర్ణాటక 04.10 కోట్లు
నార్త్ ఇండియా (హిందీ) 07.50 కోట్లు
ఓవర్సీస్ 10.90 కోట్లు
రెస్ట్ 04.00 కోట్లు
ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 77.70 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.
‘రాధే శ్యామ్’కి దాదాపు 196.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అంటే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సేఫ్ కావాలి అంటే.. 200 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఇప్పటివరకూ ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని గట్టిగా 77.7 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేకపోయింది. మరి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడానికి మరో 122.3 కోట్ల షేర్ రావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది పూర్తిగా అసాధ్యం. మొత్తానికి రాధే శ్యామ్ పరిస్థితి ఊహించిన దానికంటే దారుణంగా తయారైంది. లోకల్ గా రిలీజ్ అయిన ‘బాలయ్య’ అఖండ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ కూడా పాన్ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్’కి రాకపోవడం ప్రభాస్ అభిమానులకు అవమానకరమే.
Also Read: పునీత్ రాజ్ కుమార్ పేరు మీద రహదారి