Prabhas : తన కోసమే ప్రభాస్ పెళ్లి చేసుకోకుండా ఉన్నాడా?

ఈ ప్రశ్న సుమ వేయగానే.. ఆ అమ్మాయిల కోసమే నేను పెళ్లి చేసుకోలేదు అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు ప్రభాస్. ఇవన్నీ తన డైరెక్టర్ ఐడియాలు అంటూ కుండ బద్దలు కొట్టాడు.

Written By: NARESH, Updated On : May 23, 2024 5:02 pm

prabhas

Follow us on

Prabhas : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాబోతున్న సినిమా కల్కి 2898AD. 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీని ఏలుతూ.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన వైజయంతి మూవీస్ బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అంతే కాదు ఈ సినిమా భారీ బడ్జెట్ తో రాబోతుంది. సుమారు రూ.600 కోట్లతో ఈ మూవీని తెరకెక్కించారని టాక్. ఇందులో లెజండరీ హీరోస్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో దీపకా పదుకొనే.. దిశా పటానీ లు కథానాయికలుగా వ్యవహరిస్తున్నారు. మే 9న రిలీజ్ చేయాల్సి ఉండగా.. జనరల్ ఎలక్షన్స్ కారణంగా జూన్ 27కి వాయిదా పడింది ఈ సినిమా. ఇక సినిమా ప్రమోషన్ లలో భాగంగా బుజ్జీని లాంచ్ చేశారు మేకర్స్. ఇందులో బుజ్జి అనే రొబోటిక్ పాత్రకు ప్రముఖ నటి కీర్తి సురేష్ వాయిస్ అందించింది. ఇప్పుడు ఈ బుజ్జి పూర్తి బాడీని పరిచయం చేశాడు రెబల్ స్టార్. ఓ స్పెషల్ కారులో ప్రభాస్ ఎంట్రీని చూసి ఫిదా అయిపోయారు ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు.

అయితే ఈ రెబల్ స్టార్ ప్రభాస్ బుజ్జి కారులో వచ్చి.. కల్కి అవతారంలో మాస్ ఎంట్రీ ఇచ్చాడు. మామూలుగా ప్రభాస్ వస్తున్నాడంటేనే రేంజ్ వేరేలా ఉంటుంది.. అందులో ఓ స్టైల్ లో ఎంట్రీ ఇవ్వగా ప్రాంగణం మొత్తం దద్దరిల్లింది. అనంతరం ప్రభాస్.. బుజ్జిని పరిచయం చేశారు. ఆ తర్వాత ప్రభాస్ మాట్లాడుతూ..‘ బుజ్జిని కలిశాను.. మా బక్క డైరెక్టర్ నన్ను 3 ఇయర్స్ బుజ్జితో టార్చర్ పెట్టించాడు అంటూ తెలిపారు. నేనేదో డార్లింగ్స్ కు హాయ్ చెప్పి వెళ్లిపోదామనుకుంటే..ఈ కార్లు, ఫీట్లు చేయించాడు’ అని సరదాగా మాట్లాడాడు.

ఇదెలా ఉంటే రీసెంట్ గా ఓ ఇంట్రస్టింగ్ ఇన్ స్టా పోస్టు చేశారు ప్రభాస్. ఆ పోస్టులో ఏముందంటే త్వరలో తన జీవితంలోకి ఓ ఇంపార్టెంట్ వ్యక్తి రాబోతుంది అని తెలిపారు. అంటే త్వరలో ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, అమ్మాయిల కలల రాకుమారుడు పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి కానీ దీని వెనక అర్థం బుజ్జి క్యారెక్టర్ అని తెలిసింది. ఈ ప్రశ్న సుమ వేయగానే.. ఆ అమ్మాయిల కోసమే నేను పెళ్లి చేసుకోలేదు అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు ప్రభాస్. ఇవన్నీ తన డైరెక్టర్ ఐడియాలు అంటూ కుండ బద్దలు కొట్టాడు.