Prabhas Facebook Hacked: ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్లో రెండు వీడియోలు దర్శనమిచ్చాయి. ప్రభాస్ వంటి స్టార్ హీరో ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయడమేంటనే చర్చ మొదలైంది. ప్రభాస్ బాగా రిజర్వ్డ్ పర్సన్. తన సినిమాలు తాను చేసుకుంటూ అజ్ఞాతంలో బ్రతికేస్తుంటారు. తన ప్రతి సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ కి మాత్రమే ప్రభాస్ బయటకు వస్తారు. సినిమా విడుదలైతే మరో సినిమా విడుదలయ్యే వరకు పబ్లిక్ తో ఇంటరాక్ట్ అవ్వరు. సోషల్ మీడియాలో సైతం చాలా అరుదుగా స్పందించారు. తన సినిమా అప్డేట్స్ పోస్ట్స్ చేస్తారు. ఎవరైనా చిన్న హీరోలు రిక్వెస్ట్ చేస్తే… వాళ్ళ సినిమాల ట్రైలర్స్, టీజర్స్ పోస్ట్ చేస్తారు.
అలాంటి ప్రభాస్ ఫేస్ బుక్ అకౌంట్లో రెండు వీడియోలు దర్శనమిచ్చాయి. ఇవి రెండు ఫన్నీ వీడియోలు. అన్ లక్కీ హ్యూమన్స్, బాల్స్ పెయిల్స్ అరౌండ్ ది వరల్డ్ అనే క్యాప్షన్ తో ఆ వీడియోలు ప్రభాస్ పోస్ట్ చేశారు. సదరు వీడియోలు చూసిన అభిమానులు ఒకింత ఆందోళన చెందుతున్నారు. కారణం ప్రభాస్ ఇలాంటి వీడియోలు షేర్ చేయరు. బహుశా ఆయన అకౌంట్ హ్యాక్ కావచ్చంటున్నారు.
మరికొందరేమో ప్రభాస్ అకౌంట్ హ్యాక్ కి గురైతే ఆయన స్పందించేవారు కదా… బహుశా ఆయనే ఏదో మూడ్ లో వీడియోలు పోస్ట్ చేసి ఉండొచ్చని చర్చ నడుస్తుంది. అయితే ఫ్యాన్స్ ఊహించిందే నిజమైంది. ప్రభాస్ అకౌంట్ హ్యాక్ చేశారు. దీనిపై ప్రభాస్ స్వయంగా స్పందించారు. నా అకౌంట్ సమస్యలకు గురైంది. టీమ్ సెట్ చేసే పనిలో ఉన్నారంటూ ఆయన ఓ సందేశం విడుదల చేశారు. దాంతో అభిమానులకు ఒక క్లారిటీ వచ్చింది.
మిగతా సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ తో పోల్చితే ఫేస్ బుక్ చాలా ఈజీగా హ్యాక్ కి గురవుతుంది. ఆ మధ్య యాంకర్ విష్ణుప్రియ అకౌంట్ హ్యాక్ చేశారు. ఆమె అకౌంట్లో అస్లీల ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేశారు. విష్ణుప్రియ ఇలా చేస్తుందేంటని ఫ్యాన్స్ పొరబడ్డారు. విష్ణుప్రియ స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.