Peddi movie release issues in AP: ‘పెద్ది’ చిత్రానికి ఎటు చూసినా ప్రస్తుతం కష్టాలే కనిపిస్తున్నాయి. ఈ సినిమాని అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలని దిల్ రాజు వర్గం ప్రయత్నాలు చేస్తుంది. సరిగ్గా ఈ సినిమా విడుదల సమయం లోనే మాకు కమీషన్ బేసిస్ మీద థియేటర్స్ ని రన్ చేసుకునే పద్దతి రావాలి , లేదంటే మేము థియేటర్స్ ని క్లోజ్ చేస్తామని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చర్చల ద్వారా ‘పెద్ది’ చిత్రానికి ఎలాంటి ఆటంకాలు కలిగించమని చెప్పుకొచ్చారు కానీ, ఇప్పుడు మరోసారి ‘పెద్ది’ చిత్రం కమీషన్ బేసిస్ మీదనే రన్ చెయ్యాలి అనే డిమాండ్ ని తీసుకొస్తున్నారు. లేదంటే తెలంగాణ లో టికెట్ హైక్స్ రానివ్వకుండా చేస్తామని పరోక్షంగా బెదిరింపులు కూడా చేయడం ఈమధ్య కాలం లో మనం చాలానే చూశాము . అయితే రీసెంట్ గానే ఈ ఎక్సిభిటర్స్ గిల్డ్ కి సంబంధించిన వాళ్ళు చిరంజీవి ని కలవడం హాట్ టాపిక్ గా మారింది.
చిరంజీవి తో కలిసి ‘పెద్ది’ చిత్రం కమీషన్ బేసిస్ మీద రన్ చెయ్యాలి , థియేటర్స్ సమస్యల్లో ఉన్నాయి, మూత పడే పరిస్థితుల్లో ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. చిరంజీవి కూడా సమస్యకు పరిష్కారం ఆలోచిద్దాం అని చెప్పాడు , మరో రెండు రోజుల్లో ఇంకో మీటింగ్ ఉండబోతుంది. అదే విధంగా ప్రొడ్యూసర్స్ గిల్డ్ కి సంబంధించిన వాళ్ళు నిన్న రాజమండ్రి లో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిసి తమ సమస్యలను వివరించారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ‘పెద్ది’ చిత్రానికి టిక్కెట్ హైక్స్ ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఒకపక్క హై కోర్టు అనుమతించడం లేదు, మరో పక్క టిక్కెట్ హైక్స్ ఇచ్చినా హై కోర్టు కి వెళ్లి , ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటీషన్ వేయడానికి సిద్ధం గా ఉన్నారు కొంతమంది.
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం టిక్కెట్ హైక్స్ ఇవ్వకపోతే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇవ్వదు అనే రూమర్ ఫిలిం వర్గాల్లో గట్టిగా ప్రచారం జరిగింది. అందుకే నిన్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులంతా పవన్ కళ్యాణ్ ని కలిసి , జరిగే పరిస్థితులను వివరించారు. టికెట్ హైక్స్ కచ్చితంగా ఇస్తామని, 5 షోస్ కి కూడా అనుమతి ని ఇస్తానని పవన్ కళ్యాణ్ భరోసా ఇవ్వడం తో , నిర్మాతలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ దిల్ రాజు గ్యాంగ్ కి సంబంధించిన వాళ్ళు ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు కి వెళ్లి టిక్కెట్ హైక్స్ కి వ్యతిరేకంగా పిటీషన్ వేస్తె ఏంటి పరిస్థితి?, ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ సినిమాకు టిక్కెట్ హైక్స్ ని రద్దు చేయాల్సిన పరిస్థితులు వస్తాయా అనేది చూడాలి.
