Pawan Kalyan’s ‘Bro’ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘బ్రో ది అవతార్’ జులై 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. సముద్ర ఖని దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించాడు.ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల అవ్వగా, ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ముఖ్యంగా థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి అద్భుతమైన స్పందన లభించింది. థమన్ మిగతా హీరోల సినిమాలకంటే పవన్ కళ్యాణ్ సినిమాలకు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించే సంగతి మన అందరికీ తెలిసిందే. వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ సినిమాలకు ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆ రెండు సినిమాలకు ఆయువు పట్టులాగా నిల్చింది.
ముఖ్యంగా భీమ్లా నాయక్ సినిమాలో కంటెంట్ పెద్దగా ఏమి ఉండదు, కానీ అలాంటి కంటెంట్ లేని సన్నివేశాలను కూడా థమన్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఎలివేట్ చేసాడు. అలాగే ఇప్పుడు ‘బ్రో ది అవతార్’ చిత్రానికి కూడా అలాంటి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందించబోతున్నాడట. పవన్ కళ్యాణ్ పాత సినిమా పాటలను కొన్ని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా వాడబోతున్నారట. అది ఫ్యాన్స్ కి కూడా అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందట.
పవన్ కళ్యాణ్ బ్రో చిత్రం గురించి కూడా థమన్ స్పందించారు. పవన్ లాంటి స్టార్ ఉంటే చాలు ఆ పాటలు మిలియన్ల వ్యూస్ వస్తాయని.. ఒళ్లు దగ్గర పెట్టుకొని చేస్తే చాలన్నారు. బ్రో సినిమా కోసం పవన్ పిలిపించి కథ చెప్పించారని.. అప్పుడే అందులో సోల్ ఉందని అర్థమైందన్నారు. ఇందులో ఆత్మ ఉందని.. నువ్వే సంగీతంతో పైకి లేపాలని పవన్ చెప్పారని.. అందుకే బ్రో సినిమా కోసం చాలా కష్టపడ్టట్టు తమన్ చెప్పాడు.
ఈ సంక్రాంతికి విడుదలైన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం లో కూడా కొన్ని యాక్షన్ బ్లాక్స్ కి నరసింహ నాయుడు సినిమాకి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని వాడాడు. ఇప్పుడు ‘బ్రో’ చిత్రానికి కూడా అదే ప్రయోగం చెయ్యబుతున్నారట. ఇంతకీ పవన్ కళ్యాణ్ సినిమాల్లోని ఏ పాటని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా మార్చబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.