
Sai Dharam Tej: టాలీవుడ్ హీరోలలో ఒకరైన సాయిధరమ్ తేజ్ కు నెల రోజుల క్రితం యాక్సిడెంట్ అయిందనే సంగతి తెలిసిందే. దాదాపుగా 5 వారాల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన సాయితేజ్ నిన్న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. నిన్న సాయిధరమ్ తేజ్ డిశ్చార్జ్ కావడంతో పాటు దసరా పండుగ కావడం గమనార్హం. నిన్న సాయిధరమ్ తేజ్ పుట్టినరోజు కూడా కావడంతో చిరంజీవి, పవన్ కళ్యాణ్, పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు.
మెగాస్టార్ చిరంజీవి సాయితేజ్ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావడంతో కుటుంబం ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. ఇది సాయితేజ్(Sai Dharam Tej) కు పునర్జన్మ అని చిరంజీవి పేర్కొన్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు సాయితేజ్ అంటూ సోషల్ మీడియా వేదికగా చిరంజీవి ట్వీట్ చేశారు. సాయితేజ్ విజయదశమి రోజున ఇంటికి రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని పవన్ చెప్పుకొచ్చారు. ఈరోజే తేజ్ పుట్టినరోజు అని పవన్ ఆన్నారు.
ఈ విధంగా ఒకేరోజు రెండు పండుగలు వచ్చాయంటూ పవన్ తన పోస్ట్ ద్వారా చెప్పకనే చెప్పేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సాయితేజ్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు సాయితేజ్ తో కలిసి డ్యాన్స్ చేయడానికి ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. మెగా డాటర్ సుస్మిత సాయితేజ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు బర్త్ డే బేబీ బాయ్ అంటూ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని ప్రకటించారు.
సాయితేజ్ డిశ్చార్జ్ కావడంతో అతని అభిమానులు కూడా ఆనందిస్తున్నారు. సాయితేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. వచ్చే ఏడాది సాయితేజ్ నటించబోయే కొత్త సినిమా షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది