Site icon OkTelugu

Pawan Kalyan health update : సర్జరీ తర్వాత పవన్ కళ్యాణ్ ఏంటి ఇలా మారిపోయాడు..షాక్ కి గురి చేస్తున్న లేటెస్ట్ ఫోటోలు..

AP-CM-Chandrababu-visits-Pawan-Kalyan-residence-in-Hyderabad

Pawan Kalyan health update : జనసేన పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అనారోగ్యం కారణంగా , సర్జరీ చేయించుకొని గత కొద్దిరోజులుగా విశ్రాంతి తీసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి పై ప్రస్తుతం ఎలాంటి అప్డేట్ బయటకు రాకపోవడం తో పాటు , మూడు వారాల నుండి పవన్ కళ్యాణ్ మీడియా కి కనిపించకపోవడం వల్ల, ఆయన ఎలా ఉన్నాడో తెలియక అభిమానులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని , వేగంగా కోలుకుంటున్నాడని కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ కూడా పవన్ అభిమానులు తమ అభిమాన హీరో ని చూసేంత వరకు శాంతించేలా అనిపించలేదు. అయితే నేడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి , ఆయన ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు.

అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయితే పవన్ లుక్స్ ని చూసి అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. పవన్ కళ్యాణ్ బాగా చిక్కిపోయాడని, ముఖం లో కూడా కాస్త మార్పులు వచ్చాయని, జుట్టు , గెడ్డం బాగా పెంచేసాడని , ఒకప్పుడు ఉన్న లుక్స్ ఇప్పుడు లేవని కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఈ వారం నుండి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలి. కానీ డాక్టర్లు మరికొంత విశ్రాంతి అవసరమని చెప్పడం తో , ఆయన ఈ వారం కూడా సెలవులు పెట్టాల్సి వచ్చింది. పూర్తి స్థాయిలో కోలుకోవడానికి మరికాస్త సమయం పట్టే అవకాశం ఉండడం తో ఇప్పట్లో ఆయన ప్రభుత్వ విధుల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపోవచ్చని తెలుస్తోంది. మరో పక్క పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటాడా అని ఎదురు చూస్తున్నారు.

ఎందుకంటే ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలోనే లోకల్ బాడీ ఎన్నికలు జరగబోతున్నాయి. అందుకు సంబంధించిన కసరత్తులు చేయాల్సి ఉంది. జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చెయ్యాలి , టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీ చెయ్యాలి అనే దానిపైన కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల తాలూకు ఫైల్స్ మీద పవన్ కళ్యాణ్ సంతకాలు చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి. ఆయన మళ్లీ డ్యూటీ లోకి వచ్చేంత వరకు ఈ ఫైల్స్ ముందుకు కదిలే పరిస్థితి లేదు. చూడాలి మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు మళ్లీ తన విధుల్లోకి వస్తాడు అనేది.

Exit mobile version