Site icon OkTelugu

Pawan Kalyan Buchi Babu Movie: బుచ్చి బాబు దర్శకత్వంలో పవన్ కళ్యాణ్.. ఇలాంటి స్టోరీలో పవన్ ని కలలో కూడా ఊహించి ఉండం..

Pawan Kalyan Buchi Babu Movie

Pawan Kalyan Buchi Babu Movie

Pawan Kalyan Buchi Babu Movie: ప్రముఖ జీనియస్ దర్శకుడు సుకుమార్ శిష్యుడిగా ‘ఉప్పెన’ చిత్రం తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన బుచ్చి బాబు , మొదటి సినిమా తోనే బంపర్ హిట్ ని అందుకొని , రెండవ సినిమా ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేసే అరుదైన అవకాశాన్ని సంపాదించుకొని , ‘పెద్ది’ లాంటి చిత్రాన్ని మన ముందుకు తీసుకొని రాబోతున్నాడు. జూన్ 4 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న ఈ సినిమా మీదనే టాలీవుడ్ ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే సంక్రాంతి సీజన్ కి వచ్చిన సినిమాలు తప్ప , ఆ తర్వాత విడుదలైన సినిమాల్లో ఒక్కటి కూడా కమర్షియల్ గా హిట్ కాకపోవడం ట్రేడ్ ని తీవ్రమైన నిరాశకు గురి చేసింది. జూన్ 4 న పెద్ది భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ కి సరికొత్త ఊపిరి వస్తుందని , థియేటర్స్ బ్రతుకుతాయని అంటున్నారు.

ఇదంతా పక్కన పెడితే ‘పెద్ది’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే కచ్చితంగా డైరెక్టర్ బుచ్చి బాబు కి పాన్ ఇండియా లెవెల్ లో గొప్ప పేరొస్తుంది. రంగస్థలం రేంజ్ సినిమాని అందిస్తే ఆయనకు డైరెక్టర్ గా నేషనల్ అవార్డు కూడా రావొచ్చు. అయితే ‘పెద్ది’ తర్వాత బుచ్చి బాబు ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే అంశం పై ఇప్పుడు ఇండస్ట్రీ లో జోరుగా ప్రచారం సాగుతోంది. చాలా మంది చెప్పేది ఏమిటంటే , బుచ్చి బాబు తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయబోతున్నాడని, ఇప్పటికే ఆయన్ని కలిసి స్టోరీ ని కూడా వినిపించాడని అంటున్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే , రీసెంట్ గానే ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కలిసి విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ ఒకటి చెప్పాడట.

యూత్ ఫుల్ , మాస్ మసాలా మూవీస్ తీసే పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఇప్పటి వరకు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు. అందుకే ఆయన ఈ జానర్ లో సినిమా తీస్తే , కచ్చితంగా ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం బద్దలు అవుతాయని బుచ్చి బాబు ఆలోచన అట. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటి వరకు అలాంటి జానర్ సినిమాలు చేయలేదు కాబట్టి, కొత్తగా జనాలు ఇప్పుడు ఏది చేసిన చూస్తున్నారు కాబట్టి , కచ్చితంగా ఇది పాన్ ఇండియా లెవెల్ లో కూడా క్లిక్ అవుతుందని అనుకుంటున్నాడట బుచ్చి బాబు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి . ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఓజీ 2, సురేంద్ర రెడ్డి మూవీపై ఫుల్ ఫోకస్ పెట్టి ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాకనే బుచ్చి బాబు సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.

Exit mobile version