Site icon OkTelugu

Bro Movie Trailer: బ్రో ట్రైలర్ రివ్యూ: పవన్ అవతారాలు అద్భుతం! ఆ ఎనర్జీ ఏంట్రా బాబు… ట్రైలర్ కేక!

Bro Movie Trailer

Bro Movie Trailer

Bro Movie Trailer: బ్రో మూవీ విడుదలకు సిద్ధం కాగా ట్రైలర్ వచ్చేసింది. రెండు నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల ఈ మల్టీస్టారర్ లో పవన్ కళ్యాణ్ దేవుడు పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ట్రైలర్ లో ఆ విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పారు. కాలం చాలా విలువైంది. మనిషి జీవన్మరణాలు నిర్ణయించేది ఆ కాలమే. కాలం దేవుడి దృష్టిలో మనిషి జీవితం అంటే ఏమిటీ… టైం లేదంటూ గజిబిజి జీవితం గడిపే ఒక వ్యక్తి జీవితాన్ని ఈ కాలం ఎలా మార్చింది అనేది ప్రధాన కథ.

సాయి ధరమ్ తేజ్ తీరిక లేకుండా శ్రమించే బిజినెస్ మాన్ గా కనిపించారు. గాడ్ గా పవన్ కళ్యాణ్ ని పరిచయం చేశారు. సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యాక జరిగిన పరిస్థితులను కామెడీగా అలాగే ఆలోచనలు రేకెత్తే విధంగా తెరకెక్కించారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్స్ సీన్స్ సినిమాకు హైలెట్ కానున్నాయి. బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ కామెడీ బోనస్.

ఇక ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ ఎనర్జీ చూస్తే ఆశ్చర్యం వేసింది. ఆయన పవర్ హౌస్ లా అనిపించారు. కామెడీ టైమింగ్, సెటైర్స్ మాములుగా లేవు. మొత్తంగా బ్రో ట్రైలర్ అంచనాలు అందుకుంది. కామెడీ, ఎమోషన్స్ కలగలిపిన సోషియో ఫాంటసీ చిత్రం బ్రో. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ లాంటి సినిమా. ఆయన పూర్తి నిడివి లేకపోయినా ఉన్నత సేపు పండగ అనుకోవాలి.

బ్రో వినోదయ సితం రీమేక్ గా తెరకెక్కుతుంది. సముద్ర ఖని దర్శకుడు. వినోదయ సితం చిత్రంలో సముద్ర ఖని నటించి దర్శకత్వం వహించారు. మొదటిసారి పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందించారు. ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జులై 28న బ్రో మూవీ విడుదల కానుంది.

Exit mobile version