Site icon OkTelugu

Pawan Kalyan – Renu Desai: భరణం తీసుకోలేదంటున్న రేణూ దేశాయ్ ఇచ్చానంటున్న పవన్….! అసలు నిజం ఏంటి…?

Pawan Kalyan -Renu Desai: ఇటీవల పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణలకు చెక్ పెట్టే క్రమంలో ఓ ఆసక్తికర విషయాన్ని బయట పెట్టారు. తన ఇద్దరు మాజీ భార్యలకు భరణంగా చెల్లించిన మొత్తాన్ని మీడియా, కార్యకర్తల సమక్షంలో వెల్లడించారు. వాళ్ళతో నాకు సెట్ కాలేదు. లీగల్ గా విడాకులు ఇచ్చి విడిపోయాను. మీకు కూడా వైవాహిక జీవితంలో సమస్యలు వస్తే విడాకులు ఇచ్చి మరొక పెళ్లి చేసుకోండని పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు. ఈ క్రమంలో తాను మొదటి భార్యకు రూ. 5 కోట్లు, రెండవ భార్య రేణూ దేశాయ్ కి ఆస్తి రాసిచ్చానని వెల్లడించారు.

Pawan Kalyan -Renu Desai

అయితే గతంలో రేణూ దేశాయ్ ఈ విషయం పై మాట్లాడారు. నేను 15 ఏళ్లకే మోడలింగ్ రంగంలోకి వచ్చాను. 19 ఏళ్లకు సొంత ప్లాట్ కొనుక్కున్నాను. ఇన్వెస్టర్ గా, రైటర్ గా,డైరెక్టర్ గా, ఫ్యాషన్ డిజైనర్ గా డబ్బులు సంపాదించాను. పవన్ కళ్యాణ్ నాకు డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులతో నేను సినిమాలు నిర్మించానని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. పిల్లల పోషణ, చదువు వంటి బాధ్యతలు ఎవరి సపోర్ట్ లేకుండా నేను నెరవేర్చుతున్నానని, చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఎవరు చెప్పింది నిజమనే సందిగ్ధత ఏర్పడింది.

పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ తర్వాత రేణూ దేశాయ్ పరోక్షంగా ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. ఇక్కడ నీ వర్షన్ కాదు నా వర్షన్ కాదు… నిజం అనేది శాశ్వతం అని కోట్ రాసి వీడియో విడుదల చేశారు. అయితే రేణూ దేశాయ్ ని పవన్ కళ్యాణ్ ఆర్థికంగా ఆదుకోకపోతే ఆమె ఇన్నాళ్లు మనుగడ సాధించగలదా?. పూణే లాంటి పెద్ద నగరంలో ఇద్దరు పిల్లలతో లగ్జరీ లైఫ్ అనుభవించడం అంత ఈజీ కాదు. విడాకులు తర్వాత రేణూ దేశాయ్ పూణేలో సెటిల్ అయ్యారు. ఒక రెండేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చారు.

Pawan Kalyan -Renu Desai

ఆమెకు సొంత సంపాదన ఉన్నప్పటికీ కోట్లు పెట్టి సినిమాలు నిర్మించడం సాధ్యమయ్యే పనేనా? కేవలం ఒక ఫ్యాషన్ డిజైనర్ నిర్మాత అవుతుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఇచ్చిన దానికి ఎలాంటి ప్రూఫ్ ఉండదు. ఉన్నా ఆయన బయటపెట్టారు. ఆ ఉద్దేశంతోనే రేణూ ఇలాంటి ఆరోపణలు చేసి ఉండవచ్చు. విడాకులు ఇచ్చి పదేళ్లు అవుతుండగా ఏనాడూ పవన్ ఈ విషయాన్ని బయటపెట్టలేదు. కేవలం తనపై వస్తున్న అపవాదులకు సమాధానం చెప్పాలని మాత్రమే నిజాన్ని వెల్లడించారు.

Exit mobile version