Site icon OkTelugu

NTR Devara Part – 1 Fear Song : దేవర ఫియర్ సాంగ్ రివ్యూ : దేవరగా కెరటాలను ఎరుపెక్కించిన ఎన్టీఆర్, అనిరుధ్ మ్యూజిక్ కేక!

NTR Devara Part - 1 Fear Song Review

NTR Devara Part - 1 Fear Song Review

NTR Devara Part – 1 Fear Song : ఆర్ ఆర్ ఆర్ అనంతరం ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర. మాస్ అండ్ ఫెరోషియస్ రోల్ చేస్తున్నారు ఎన్టీఆర్. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవరలో ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే పురస్కరించుకుని ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు. ఫియర్ సాంగ్ పేరున విడుదలైన ఫస్ట్ సింగిల్ నభూతో నభవిష్యతి అన్నట్లు ఉంది. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ట్యూన్స్ ఇచ్చాడు అనిరుధ్ రవిచంద్రన్. ఈ సాంగ్ లో ఆయన ప్రత్యేకంగా నటించడం విశేషం.

కేవలం ప్రమోషనల్ సాంగ్ లో అనిరుధ్ కనిపిస్తారు. చెన్నై వెళ్లిన టీమ్ అనిరుధ్ మీద ఈ సాంగ్ చిత్రీకరించడం జరిగింది. దేవర మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా వైల్డ్ గా డిజైన్ చేశాడు దర్శకుడు కొరటాల శివ. శత్రువుల మీద సింహంలా విరుచుకు పడి, రక్తపుటేరులు పారించేవాడిగా ఎన్టీఆర్ రోల్ ఉంటుంది. ఆయన క్యారెక్టరైజేషన్ తెలియజేసేలా ఫియర్ సాంగ్ రూపొందించారు.

స్టార్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి గొప్ప సాహిత్యం అందించారు. ఆయన వర్ణనలు, వాడిన పదాలు ఎన్టీఆర్ రోల్ ని ఓ రేంజ్ ని ఎలివేట్ చేస్తున్నాయి. ఇక సాంగ్ లో విజువల్స్ మరో ఆకర్షణ. సాగరతీరాన్ని డార్క్ షేడ్స్ లో అద్భుతంగా ప్రజెంట్ చేశారు. విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. మొత్తంగా సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేసింది. దేవర దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది.

దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నారు. శ్రీకాంత్ ఓ కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఎన్టీఆర్ ది డ్యూయల్ రోల్ అంటున్నారు. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ కలిని నిర్మిస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ అనంతరం ఎన్టీఆర్ నుండి వస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఆకాశానికి చేరాయి.

 

Exit mobile version