Devara Part – 1 Fear Song : దేవర ఫియర్ సాంగ్ లో ఎన్టీయార్ క్యారెక్టర్ మొత్తం చెప్పేసారు… వాటే లిరిక్స్ పీక్స్ అంతే…

ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వస్తున్న ఈ దేవర సినిమా ఈ సంవత్సరం చాలా పెద్ద హిట్ కొట్టబోతుందని మరొకసారి ఈ సాంగ్ ద్వారా తెలిసిపోతుంది.

Written By: NARESH, Updated On : May 19, 2024 10:25 pm

NTR Devara Part - 1 Fear Song Review

Follow us on

Devara Part – 1 Fear Song : దేవర మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ గా “ఫియర్ సాంగ్” రిలీజ్ అయింది. ఇక ఈ సాంగ్ మైండ్ బ్లోయింగ్ గా ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పుడు రిలీజ్ చేసిన వీడియో లో ఈ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు అనిరుధ్ గానీ, ఆయన బ్యాగ్రౌండ్ లో వస్తున్న ఎన్టీయార్ యాక్షన్ ఎపిసోడ్స్ గానీ పాటకు అనుకూలంగా ప్లే చేస్తూ వచ్చారు. ఇక మొత్తానికైతే ఈ సాంగ్ లో ఎన్టీఆర్ ప్రళయకాలా రుద్రుడి లా కనిపించాడు. “భయానికి ధైర్యం తోడు ఉండాలి. మరి ఆ ధైర్యం కూడా భయపడ్డప్పుడు ఈ దేవర తోడుగా ఉంటాడు”. అనేలా దేవర సినిమా మీద ఒక్కసారిగా ఈ సాంగ్ హైప్ ను పెంచేసిందనే చెప్పాలి.

ఇక అలా కాకుండా తన క్యారెక్టర్జేషన్ ను చూపించే ప్రయత్నం అయితే ఈ సాంగ్ లో చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ తో ఈ సినిమాలో ఎంటైర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ని ఈ ఒక సాంగ్ లో ఎస్టాబ్లిష్ చేసేసారు. మన అనుకున్న వాళ్లకోసం ముందు నిలబడే క్యారెక్టర్ గా ఈ దేవర ఉండబోతుంది. ఆయన రాసిన ప్రతి వర్డ్ కూడా ప్రాణం పెట్టి రాసినట్టుగా ఉంది.

ఇక అనిరుధ్ ఇంతకుముందు వర్క్ చేసిన సినిమాలన్నింటి కంటే కూడా ఈ సినిమా సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవల్ ఉందనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్ లో భారీ వ్యూయర్ షిప్ ను దక్కించుకుంటూ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. ఇక ఎన్టీఆర్ అభిమానులైతే ఈ పాట కోసం ఎంతగా వెయిట్ చేశారో ఇప్పుడు అంతకుమించి ఎంజాయ్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో వస్తున్న ఈ దేవర సినిమా ఈ సంవత్సరం చాలా పెద్ద హిట్ కొట్టబోతుందని మరొకసారి ఈ సాంగ్ ద్వారా తెలిసిపోతుంది. ఇక అనిరుధ్ ఇంతకు ముందు చేసిన విక్రమ్, జైలర్ సినిమాల సాంగ్స్ ను మించి ఈ సాంగ్ ఉండబోతుంది అంటూ మొదటి నుంచి ప్రచారం అయితే జరుగుతుంది. దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ సాంగ్ తో అదరగొట్టాడనే చెప్పాలి…