Pan India Movies: నేషనల్ సినిమాల్లో కూడా ఇప్పుడు అంతా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించే చర్చ జరుగుతుంది. ఆ చర్చలకు తగ్గట్టు నేషనల్ నెంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి అంటూ కొందరు సినీ విశ్లేషకులు కూడా తమదైన శైలిలో వ్యాసాలు రాస్తున్నారు. మొత్తమ్మీద రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ పై అందరి చూపు ఉంది. అయితే, హిందీ బడా నిర్మాతలు మాత్రం ఈ సినిమాలో నటించిన ఎన్టీఆర్ పై ఏకాగ్రత పెట్టారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ లతో పాటు అజయ్ దేవగన్, అలియా, శ్రీయాలు కూడా నటించారు. అయితే, మొదటి నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాలో బాగా హైలైట్ అయింది ఎన్టీఆర్ మాత్రమే. స్వతహాగా ఎన్టీఆర్ నటన బాగుండటం, అలాగే ఎన్టీఆర్ హిందీ భాష నేర్చుకుని.. పూర్తిగా హిందీ మాట్లాడుతూ అక్కడ ప్రజలను ఆకట్టుకోవడం.. అన్నిటికీ మించి ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీకి హిందీ జనాలు ఫ్యాన్స్ అవ్వడంతో ఎన్టీఆర్ ప్రభ హిందీలో వెలిగిపోతుంది.
అందుకే, ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్న స్టార్ పాన్ ఇండియా డైరెక్టర్లకు ఫస్ట్ ఆప్షన్ గా ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. కేవలం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లోనే ఎన్టీఆర్ తన మార్క్ ను చూపించాడు అని హిందీ ఫిల్మ్ మేకర్స్ కూడా ఎన్టీఆర్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. నిజానికి ఎన్టీఆర్ హైలైట్ అవ్వలేదు. హైలైట్ అయ్యేలా రాజమౌళి ప్లాన్ చేశాడు.
Also Read: రెండో సినిమాతో ఇక తెలుగు తెర పై నిలబడి పోయినట్టే !
అందరిలోకెల్లా ఎన్టీఆర్ ఎక్స్ ప్రెషన్స్, తారక్ తన కళ్ళల్లో చూపించిన ఎమోషన్స్ అద్భుతంగా పేలాయి అంటే.. అందుకు కారణం రాజమౌళి ఎన్టీఆర్ పై తీసుకున్న ప్రత్యేక షాట్స్ లే. జూనియర్ ఎన్టీఆర్ అంటే రాజమౌళికి ప్రత్యేక అభిమానం ఉంది. ఆ అభిమానమే ఎన్టీఆర్ ఎమోషన్స్ కి కారణం అయి ఉండొచ్చు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో మరో ఏ నటుడికి క్లోజ్ లు పెట్టని విధంగా.. రాజమౌళి, ఎన్టీఆర్ కు మాత్రమే ప్రత్యేక క్లోజ్ షాట్స్ పెట్టాడట. పైగా ఎన్టీఆర్ సీన్స్ అన్నీ అద్భుతంగా వచ్చేలా రాజమౌళి ముందు నుంచీ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. దానికి తగ్గట్టు ఎన్టీఆర్ కూడా అద్భుతంగా నటించాడు. ఎంతైనా ఎన్టీఆర్ అంటే ఎన్టీఆరే కదా.
Also Read: 14 ఏళ్లుగా ఈరోజు కోసమే వెయిట్ చేశా అంటున్న అల్లు శిరీష్…