Balakrishna: NBK 109 అప్డేట్… రంగంలోకి దిగిన బాలయ్య, మతిపోగొడుతున్న ఆ పోస్టర్!

2023 సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డిగా దిగాడు బాలయ్య. మిక్స్డ్ టాక్ తో కూడా వీరసింహారెడ్డి హిట్ స్టేటస్ అందుకుంది. వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

Written By: NARESH, Updated On : November 8, 2023 12:26 pm

Balakrishna

Follow us on

Balakrishna: వరుస విజయాలతో ఊపుమీదున్నాడు బాలయ్య. ఇక పని అయిపోయింది అనుకుంటున్న సమయంలో కెరటంలా లేచాడు. అఖండ మూవీకి ముందు వరకు బాలయ్య పరిస్థితి దారుణంగా ఉంది. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ పడ్డాయి. కనీసం పది కోట్లు రావడం కూడా కష్టమే అన్నట్లు మార్కెట్ తయారైంది. గడ్డుకాలంలో బోయపాటి శ్రీను బాలయ్యను కాపాడాడు. అఖండ రూపంలో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. 2021 డిసెంబర్ లో విడుదలైన అఖండ లాభాలు పంచింది.

2023 సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డిగా దిగాడు బాలయ్య. మిక్స్డ్ టాక్ తో కూడా వీరసింహారెడ్డి హిట్ స్టేటస్ అందుకుంది. వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక లేటెస్ట్ హిట్ భగవంత్ కేసరి. బాలయ్య ఓ భిన్నమైన పాత్ర చేశారు. యాక్షన్, సెంటిమెంట్ కలగలిపి దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన భగవంత్ కేసరి దసరా విన్నర్ గా నిలిచింది. బాలయ్యకు మరో హిట్ ఇచ్చింది.

భగవంత్ కేసరి సెట్స్ పై ఉండగానే బాలకృష్ణ దర్శకుడు బాబీతో ఓ ప్రాజెక్ట్ ప్రకటించారు. బాలయ్య 109వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకుంది. ఓ పెట్టెలో మరణాయుధాలు, డబ్బుతో పాటు మాన్షన్ హౌస్ బాటిల్ ఉంది. బాలయ్య క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశాడో ఆ పోస్టర్ తెలియజేసింది. వాల్తేరు వీరయ్యతో బాబీ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆయన దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న ఫస్ట్ మూవీ ఇది.

నేడు ఈ చిత్ర అప్డేట్ ఇచ్చారు. NBK 109 షూటింగ్ మొదలుపెట్టారట. ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలియజేశారు. ఈ అప్డేట్ కోసం స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. గొడ్డలికి కళ్ళజోడు తగిలించి ఉంది. అలాగే ఆంజనేయుడు లాకెట్ కూడా ఆ గొడ్డలికి చూడొచ్చు. మొత్తంగా ఆరంభంలోనే అంచనాలు పెంచేస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.