Site icon OkTelugu

Balakrishna Remuneration: ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన నందమూరి బాలకృష్ణ రెమ్యూనరేషన్

Balakrishna Remuneration: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి బాలకృష్ణ కి ఉన్న మాస్ ఫ్యాన్ బేస్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..విలక్షణమైన పాత్రలతో ఎన్నో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన బాలయ్య బాబు కి ఫ్లాప్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి..కానీ బాలయ్య బాబు హిట్ కొడితే మాములుగా ఉండదు అనే విషయం 60 ఏళ్ళ వయస్సు లో కూడా నిరూపిస్తున్నాడు బాలయ్య బాబు ..గత ఏడాది బోయపాటి శ్రీను తో ఆయన చేసిన అఖండ సినిమా ఎంత పెద్ద సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..అతి తక్కువ టికెట్ రేట్స్ తో విడుదలైన ఈ సినిమా 75 కోట్ల రూపాయిలు షేర్ ని వసూలు చేసి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపొయ్యేలా చేసింది..బాలయ్య బాబు హిట్ కొడితే బాక్స్ ఆఫీస్ రేంజ్ ఎలా ఉంటుందో మరోసారి నిరూపించింది ఈ సినిమా..ఈ చిత్రం ఇచ్చిన జోష్ తో బాలయ్య బాబు వరుసగా కుర్ర డైరెక్టర్స్ తోనే సినిమాలు ఒప్పుకున్నాడు.

Balakrishna

ప్రస్తుతం ఆయన క్రాక్ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని తో ఒక సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవలే ఈ చిత్రం టీజర్ కూడా విడుదల కాగా దానికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..అఖండ సినిమాకి ముందు కేవలం 5 నుండి 6 కోట్ల రూపాయిల పారితోషికం తీసుకునే బాలయ్య బాబు, అఖండ సినిమాకి ఏకంగా 8 నుండి 10 కోట్ల రూపాయిల పారితోషికం తీసుకున్నాడు..ఇప్పుడు గోపీచంద్ మలినేని తో చేస్తున్న సినిమా ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.

Also Read: Anasuya Bharadwaj: అందాల వయ్యారాలలో అనసూయ అరాచకం.. మళ్లీ మత్తెక్కించిన రంగమ్మత్త !

Balakrishna

అఖండ సినిమా భారీ హిట్ అవ్వడం తో బాలయ్య బాబు మైత్రి మూవీ మేకర్స్ ని 12 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడట..మైత్రి మూవీ మేకర్స్ వారు కూడా ఇందుకు ఎలాంటి అభ్యంతరం తెలపకుండా ఒప్పుకున్నారు..ఈ సినిమా తర్వాత ఆయన చెయ్యబోతున్న అనిల్ రావిపూడి సినిమాకి అయితే ఏకంగా 15 కోట్ల రూపాయిలు డిమాండ్ చేస్తునట్టు సమాచారం..ఈ రెండు సినిమాలు హిట్ అయితే బాలయ్య బాబు తర్వాత చెయ్యబొయ్యే సినిమాలకు 20 నుండి 25 కోట్ల రూపాయిలు డిమాండ్ చేసిన ఆశ్చర్య పోనక్కర్లేదు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న.

Also Read:Pawan Kalyan- Film Industry: పవన్ కళ్యాణ్ సీఎం.. జనసేన వైపు సినీ పరిశ్రమ టర్న్?

Exit mobile version