Nagarjuna: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోల హవ భారీగా పెరిగిపోతుంది. ఇక ఇప్పటికే వీళ్లు వరుస సినిమాలను లైన్ లో పెడుతూ యంగ్ హీరోలకు సైతం పోటీని ఇస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే నాగార్జున కూడా ఇప్పుడు తన వందో సినిమా కోసం చాలా కసరత్తులను చేస్తున్నాడు. ఇప్పటికే పది పదిహేను స్క్రిప్ట్ లను విన్న నాగార్జున తన వందో సినిమా కోసం ఏ స్టోరీని ఫైనల్ చేయాలో తెలియక సతమతమవుతున్నాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమా విషయంలో ఆయన చాలా వరకు ఆచితూచి వ్యవహరించబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక చిరంజీవి 100 వ సినిమాగా కొందండ రామిరెడ్డి దర్శకత్వంలో “త్రినేత్రుడు ” అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆశించిన మేరకు విజయం అయితే సాధించలేదు. ఇక ఆ తర్వాత బాలయ్య బాబు కూడా తన వందో సినిమాగా గౌతమీపుత్ర శాతకర్ణి అనే సినిమా చేశాడు. ఇక ఇది ఒక డిఫరెంట్ అటెంప్ట్ గా మిగిలింది. కానీ సూపర్ డూపర్ సక్సెస్ సాధించలేకపోయింది.
కాబట్టి వాళ్ళిద్దర్నీ బీట్ చేస్తూ ఇప్పుడు నాగార్జున చేయబోయే వందో సినిమా తనకు మంచి గుర్తింపుతో తీసుకు రావడంతో పాటు భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని కూడా సాధించి పెట్టాలనే ఉద్దేశ్యం తో ఆయన తీవ్రమైన కసరత్తులను చేస్తూ స్క్రిప్ట్ ను ఫైనల్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ప్రస్తుతం నాగార్జున కెరీర్ లో ఎటు చూసిన కూడా అంత బ్యాడ్ ఫెజ్ నడుస్తుంది. అటు నాగచైతన్య సమంతను పెళ్లి చేసుకొని డివోర్స్ తీసుకున్నాడు. ఇక అప్పటి నుంచి నాగచైతన్య సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ అయితే సాధించడం లేదు.
ఇక అఖిల్ అయితే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు కావస్తున్న ఇప్పటివరకు ఒక సక్సెస్ ని కూడా సాధించలేకపోయాడు. ఇక ఇటు నాగార్జున కూడా వరుస ఫ్లాప్ లను మూటగట్టుకుంటున్నాడు. ఇక ఈ వందో సినిమా అయినా సక్సెస్ ఫుల్ గా చేసి కొంతవరకు తన కుటుంబాన్ని కానీ, తన ఫ్యాన్స్ ని గాని ఆనందింపజేయాలని చూస్తున్నాడు…