The Ghost Movie Closing Collections: అక్కినేని నాగార్జున గారి పేరు ఎత్తితే మనకి ముందుగా గుర్తుకుం వచ్చేది ప్రయోగాలు..టాలీవుడ్ లో ప్రతీ స్టార్ హీరో ప్రయోగాలు చేసారు కానీ..ప్రయోగాలు చేసి సక్సెస్ రేట్ ని బాగా చూసిన ఏకైక హీరో మాత్రం నాగార్జున గారే..తన తోటి అగ్ర హీరోలందరూ వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోలుగా ఎదిగితే..నాగార్జున మాత్రం తన కెరీర్ మొత్తం ప్రయోగాలు చేసి సక్సెస్ రేట్ ని అందుకొని స్టార్ హీరో గా ఎదిగాడు.

ఇలాంటి హీరోలు మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో దొరకడం చాలా అరుదు..అయితే నాగార్జున గారు ఆరు పదుల వయస్సు మీద పడిన తర్వాత కూడా అలాంటి ప్రయోగాలు చెయ్యడం..అవి బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన పరాజయం పాలవ్వడం తో తన స్టార్ స్టేటస్ ని మొత్తం పోగొట్టుకున్నాడు..దానికి ఉదాహరణ గా ఎన్నో సినిమాలు వచ్చాయి..ఇప్పుడు లేటెస్ట్ గా ఘోస్ట్ సినిమా కూడా ఆ కోవకి చెందిన సినిమా..కాస్త వెరైటీ గా..మునుపెన్నడూ చూడని యాక్షన్ బ్లాక్స్ కొత్త రకంగా తీసినప్పటికి కూడా ప్రేక్షకుల నుండి ఈ సినిమాకి యావరేజి టాక్ మాత్రమే వచ్చింది..కానీ డైలీ వసూళ్లు మాత్రం మొదటి రోజు నుండే అతి దారుణంగా ఉన్నాయి..ఇప్పుడు దాదాపుగా ఈ సినిమా బిజినెస్ అన్ని ప్రాంతాలలో ముగియబోతుండడం తో క్లోసింగ్ కలెక్షన్స్ ఇవేనని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.
ప్రాంతం షేర్ కలెక్షన్స్
నైజం 1.40 కోట్లు
సీడెడ్ 0.57 కోట్లు
ఉత్తరాంధ్ర 0.78 కోట్లు
ఈస్ట్ 0.40 కోట్లు
వెస్ట్ 0.22 కోట్లు
నెల్లూరు 0.24 కోట్లు
గుంటూరు 0.40 కోట్లు
కృష్ణ 0.45 కోట్లు
మొత్తం 4.46 కోట్లు
ఓవర్సీస్ 0.55 కోట్లు
కర్ణాటక
+ 0.35 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా
వరల్డ్ వైడ్ 5.36 కోట్లు
ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల రూపాయలకు జరగగా ఫుల్ రన్ లో సుమారుగా 22 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వాటిల్లినట్టు తెలుస్తుంది..మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ చిత్రానికి పోటీగా నిలబడడం వల్లే ఆ సినిమా ప్రభావం దీనిపై బలంగా పడింది అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు సినిమా తో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్న నాగార్జున..వెంటనే ది ఘోస్ట్ సినిమాతో డిజాస్టర్ సినిమాని కూడా అందుకున్నాడు..ఇక తన తదుపరి చిత్రం అక్కినేని అఖిల్ తో కలిసి గాడ్ ఫాదర్ చిత్ర దర్శకుడు మోహన్ రాజా తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు నాగార్జున..ఈ సినిమా మీదనే ఆయన ఫాన్స్ ఆశలన్నీ పెట్టుకున్నారు.