Site icon OkTelugu

Naga Chaitanya 2nd Marriage: నాగ చైతన్య రెండో పెళ్లి కోసం నానా తంటాలు పడుతున్న నాగార్జున…

Nagarjuna plan for Naga Chaitanya Second Marriage

Naga Chaitanya 2nd Marriage: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో అక్కినేని నాగార్జున ఒకరు. ఈయన ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో సక్సెస్ లు పెద్దగా రానప్పటికి ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలతో ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక మొదటి నుంచి కూడా నాగార్జున మిగితా హీరోల కంటే కూడా చాలా వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ వచ్చాడు. ఒకటి రొమాంటిక్, మరొకటి మాస్, ఇంకోటి కామెడీ, మరొకటి భక్తి రస చిత్రం ఇలా తను అన్ని జానర్స్ లో సినిమాలు చేస్తూ స్టార్ గా ఎదిగాడు.

అయితే నాగార్జున ఏరీ కోరి నాగచైతన్య సమంతల ప్రేమను పెళ్లిగా మార్చాడు. ఇక వీళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటారు అనుకంటే, ఈ జంట కొద్దిరోజులు కలిసి ఉన్నాక ఇద్దరి మధ్యలో కొన్ని తగాదాలు వచ్చాయి. దాంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు.ఇక ఇప్పుడు నాగ చైతన్య ఒంటరిగా ఉంటున్నాడు. దాంతో నాగార్జున నాగ చైతన్య కి రెండో పెళ్లి చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక వాళ్ళ రిలేషన్స్ లో ఉన్న ఒక అమ్మాయిని నాగచైతన్యకు ఇచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది.

కానీ నాగ చైతన్య మాత్రం ఇప్పుడు తన పెళ్లి మీద ఎక్కువ గా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ప్రస్తుతం సినిమాల మీదనే ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా నాగచైతన్యకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును కూడా తీసుకొస్తుందని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

ఇక ఇలాంటి క్రమం లో ఈ సినిమాతో నాగ చైతన్య ఒక సాలిడ్ హిట్ కొడితే మాత్రం ఆయన మార్కెట్ భారీగా పెరుగుతుంది… ఇకఇది ఇలా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో అయిన నాగార్జున మాత్రం ఈ ఇయర్ ఎండింగ్ లో గానీ, లేదా నెక్స్ట్ ఇయర్ లో గాని నాగ చైతన్యకి రెండో పెళ్లి చేయాలని ఫిక్స్ అయినట్టు గా తెలుస్తుంది.

Exit mobile version